మురుగుతో అవస్థలు.. | - | Sakshi
Sakshi News home page

మురుగుతో అవస్థలు..

Aug 17 2026 7:35 AM | Updated on Aug 17 2026 7:35 AM

పట్టణంలోని జీఎస్‌నగర్‌లో గ్రామకంఠం స్థలంలో ఇళ్ల నుంచి వస్తున్న మురుగు నిల్వ ఉంటుంది. ఏళ్లుగా నీరు నిలిచి రంగు మారి దోమలు వృద్ధి చెందడంతో రోగాల బారిన పడుతున్నాం. అధికారులు, ప్రజాప్రతినిధులకు పలుమార్లు విన్నవించినా పట్టించుకోవడం లేదు.

– ఫాతిమాబేగం, అమరచింత

ముందస్తు చర్యలు కరువు..

వర్షాకాలంలో విష జ్వరాలు వ్యాప్తి చెందకుండా అధికారులు ముందస్తు చర్యలు చేపట్టాలి. మురుగు కాల్వలను ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తూ దోమల నివారణకు రసాయనాలను పిచికారీ చేయాలి. కాలనీల్లో అపరిశుభ్ర ప్రదేశాలను గుర్తించి బ్లీచింగ్‌ పౌడర్‌ చల్లించాలి.

– శ్రీధర్‌రెడ్డి, పెబ్బేరు

ఫాగింగ్‌ చేపడతాం..

పురపాలికలో దోమల వ్యాప్తి అధికంగా ఉందనే ఫిర్యాదులు వస్తున్నాయి. నివారణకు ఫాగింగ్‌ చేపట్టేలా చర్యలు తీసుకుంటాం. ప్రతి శుక్రవారం డ్రైడే కార్యక్రమం చేపట్టి పుర ప్రజలకు పరిసరాల శుభ్రతపై అవగాహన కల్పిస్తున్నాం. స్వచ్ఛ పురపాలికగా తీర్చిదిద్దేందుకు తమ ఇంటి పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని సూచిస్తున్నాం.

– నూరుల్‌నదీం, పుర కమిషనర్‌, అమరచింత

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement