కోడేరు: ప్రజా సంక్షేమమే తమ ప్రభుత్వ ధ్యేయమని రాష్ట్ర ఎకై ్సజ్, పర్యాటకశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. మంగళవారం మండలంలోని సింగాయిపల్లిలో కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకం లబ్ధిదారులకు చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. పేదల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం అమలుచేస్తున్న పథకాలతో అర్హులందరికీ లబ్ధి చేకూరుతోందన్నారు. ఆర్థిక భారం ఉన్నప్పటికీ ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తున్నట్లు చెప్పారు. ప్రభుత్వ పథకాలను అర్హులందరూ సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ కొత్త రామ్మోహన్‌రావు, గుండ్యవాల్యానాయక్ తండా సర్పంచ్ కాట్రావత్ పార్వతి, లింగస్వామి తదితరులు పాల్గొన్నారు.


