ఉద్యోగుల బకాయిలు వెంటనే చెల్లించాలి | - | Sakshi
Sakshi News home page

ఉద్యోగుల బకాయిలు వెంటనే చెల్లించాలి

Aug 5 2026 12:42 AM | Updated on Aug 5 2026 12:42 AM

వనపర్తిటౌన్‌: విశ్రాంత ఉద్యోగులకు న్యాయంగా అందాల్సిన రూ.900 కోట్ల బకాయిలను వెంటనే విడుదల చేయాలని ఆర్టీసీ విశ్రాంత ఉద్యోగుల సంఘం జిల్లా గౌరవ అధ్యక్షుడు వాకిటి శ్రీధర్‌, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి సత్యం డిమాండ్‌ చేశారు. బస్‌భవన్‌ ముట్టడిని అడ్డుకోవడంతో మంగళవారం జిల్లాకేంద్రంలోని రాజీవ్‌చౌక్‌లో విశ్రాంత ఆర్టీసీ ఉద్యోగులతో కలిసి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఆర్టీసీ విశ్రాంత ఉద్యోగులు బకాయిలు చెల్లించండంటూ బస్‌భవన్‌ను ముట్టడించేందుకు ప్రయత్నిస్తే అక్రమ అరెస్టులు చేస్తారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. వయో వృద్ధులని చూడకుండా అరెస్టులు చేయడం ప్రభుత్వ చేతగానితనానికి నిదర్శనమని మండిపడ్డారు. 2017 నుంచి రావాల్సిన ఆర్బీఎస్‌, గ్రాట్యుటీ, పెన్షన్‌ బకాయిలు వెంటనే విడుదల చేయాలన్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే సమస్యలు పరిష్కరిస్తామని ఎన్నికల సమయంలో కాంగ్రెస్‌పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొని ఇప్పుడు మోసం చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికై నా స్పందించి బకాయిలు వెంటనే చెల్లించాలని, లేకపోతే తగిన మూల్యం చెల్లించుకోకతప్పదని హెచ్చరించారు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్‌ నాయకుడు ప్రేమ్‌నాథ్‌రెడ్డి ఆర్టీసీ విశ్రాంత ఉద్యోగులు రామచంద్రారెడ్డి, అంజయ్య, ఉపేందర్‌, ప్రకాష్‌, సత్యనారాయణగౌడ్‌, హుస్సేన్‌ అలీ, స్వామి, రాఘవరెడ్డి, బీవీ రావు, గాంధీ, కురుమయ్య, రామ్మూర్తి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement