మరో వారం రోజులు.. | - | Sakshi
Sakshi News home page

మరో వారం రోజులు..

Aug 5 2026 12:42 AM | Updated on Aug 5 2026 12:42 AM

త్వరగా సాగునీరు అందించాలి..

అమరచింత ఎత్తిపోతల పథకం ఆయకట్టు పరిధిలో 4 ఎకరాల పొలం ఉంది. యాసంగిలో క్రాప్‌ హాలీడే ప్రకటించడంతో ఈసారి వానాకాలంలోనైనా వరి సాగుచేద్దామని బోరుమోటారు నీటితో వరి నారుమడిని సిద్ధం చేసుకున్నా. త్వరగా సాగునీరు విడుదల చేసి పంటలు పండే విధంగా తగిన చర్యలు తీసుకోవాలి.

– వెంకటేశ్వర్‌రెడ్డి, రైతు, అమరచింత

26 ఏళ్ల తర్వాత మరమ్మతు..

అమరచింత ఎత్తిపోతల పథకం నిర్మించి 26 ఏళ్లు అవుతోంది. లిఫ్ట్‌ ఏర్పాటు సమయంలో వేసిన 5 పైపులకు చిన్నపాటి రంధ్రాలు ఏర్పడటంతో మంత్రి వాకిటి శ్రీహరి దృష్టికి తీసుకెళ్లగా.. మరమ్మతుకు చిన్ననీటి పారుదలశాఖ నుంచి రూ.56 లక్షలు మంజూరు చేశారు. ఆయా పైపులతో పాటు బ్రేకర్‌ను ఈసారి మార్చుతున్నాం. – ఆంజనేయులు, ప్రధానకార్యదర్శి, అమరచింత ఎత్తిపోతల పథకం నిర్వహణ కమిటీ

అమరచింత ఎత్తిపోతల పథకం పంప్‌హౌజ్‌ వద్ద సెక్షన్‌ పైపుల బిగింపు పనులు మరో వారం పాటు కొనసాగనున్నాయి. యాసంగిలోనే పూర్తి కావాల్సి ఉండగా.. సాంకేతిక కారణాలతో జాప్యం జరిగింది. త్వరగా పూర్తి చేయాలని కాంట్రాక్టర్‌ను ఆదేశించాం. పనులు పూర్తికాగానే ఆయకట్టుకు సాగునీరు వదిలేందుకు ప్రతిపాదనలు పంపాం. – వంశీకృష్ణ, ఏఈ చిన్ననీటిపారుదలశాఖ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement