సమస్యలు ఆలకించి.. వినతులు స్వీకరించి | - | Sakshi
Sakshi News home page

సమస్యలు ఆలకించి.. వినతులు స్వీకరించి

Aug 4 2026 12:35 AM | Updated on Aug 4 2026 12:35 AM

ప్రజావాణికి

50 ఫిర్యాదులు

త్వరగా పరిష్కరించాలనిఅదనపు కలెక్టర్ల ఆదేశం

వనపర్తి/వనపర్తి రూరల్‌: కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజావాణికి ఫిర్యాదులు పోటెత్తాయి. ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారులతో కలిసి అదనపు కలెక్టర్లు ఖీమ్యానాయక్‌, వినోద్‌కుమార్‌ ప్రజల సమస్యలను స్వయంగా తెలుసుకొని వినతులు స్వీకరించారు. మొత్తం 50 ఫిర్యాదులు అందగా.. పరిష్కారం నిమిత్తం సంబంధిత అధికారులకు పంపించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజావాణికి వచ్చిన వినతులను ఎప్పటికప్పుడు పరిష్కరించి.. ఆ సమాచారాన్ని సంబంధిత ఫిర్యాదుదారుడికి తెలియజేయడంతో పాటు ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని ఆదేశించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఫిర్యాదులను పెండింగ్‌లో ఉంచొద్దన్నారు. సీఎం, జిల్లా మంత్రి నుంచి వచ్చిన దరఖాస్తులను సైతం సత్వరమే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. కాగా, ఆర్డీఓ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణిలో రెండు అర్జీలు అందినట్లు సిబ్బంది తెలిపారు. కార్యక్రమంలో జెడ్పీ సీఈఓ యాదయ్య, స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌ ఎన్‌.తిరుపతయ్య పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement