వనపర్తిటౌన్: తమ సమస్యలు పరిష్కరించాలని టీఎస్‌ఆర్టీసీ విశ్రాంత ఉద్యోగుల సంఘం రాష్ట్ర ప్రధానకార్యదర్శి సత్యన్న ఆధ్వర్యంలో జిల్లా నాయకులు ఆదివారం ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డికి వినతిపత్రం అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ.. వనపర్తి బస్టాండ్ ఆవరణలో తొలగించిన కుర్చీలను తిరిగి ఏర్పాటు చేయించాలన్నారు. సంబంధిత అధికారులు, ప్రభుత్వంతో మాట్లాడి సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తానని.. బస్టాండ్ ఆవరణలో సిమెంట్ కుర్చీలను తిరిగి ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో సంఘం జిల్లా గౌరవ అధ్యక్షుడు మచ్చ శ్రీనివాస్, ప్రధానకార్యదర్శి కె.వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.
ఘనంగా స్నేహితుల
దినోత్సవం
వనపర్తిటౌన్: కుల, మత, ప్రాంతాల సరిహద్దులు లేని ఏకై క పవిత్ర బంధం స్నేహమని వాసవి వనితక్లబ్ అధ్యక్షురాలు కొంపల రజిత అన్నారు. ఆదివారం జిల్లాకేంద్రంలో వాసవి వనిత క్లబ్ గోల్డ్ ఆధ్వర్యంలో స్నేహితుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్‌చేసి ఒకరికొకరు పంచుకొని శుభాకాంక్షలు చెప్పారు. వివిధ క్రీడాపోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. స్నేహబంధం జీవితంలో అత్యంత విలువైందని.. కష్టసుఖాల్లో తోడుగా ఉండేవారే నిజమైన స్నేహితులని చెప్పారు. కార్యక్రమంలో సంఘం ప్రధానకార్యదర్శి పాపిశెట్టి రాధిక, కోశాధికారి కటకం ప్రశాంతి, వనితక్లబ్ సభ్యులు, ఆర్యవైశ్య మహిళలు తదితరులు పాల్గొన్నారు.


