కొత్తకోట రూరల్: హన్మకొండ జేఎన్ స్టేడియంలో ఆగస్టు 7, 8 తేదీల్లో జరిగే 5వ తెలంగాణ రాష్ట్రస్థాయి జావెలిన్ డే అథ్లెటిక్స్ మీట్–2026కు జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జిల్లాస్థాయి అథ్లెటిక్స్ ఎంపికలు శనివారం జిల్లాకేంద్రంలోని డా. బాలకిష్ణయ్య క్రీడా ప్రాంగణంలో నిర్వహించారు. ఈ పోటీల్లో అండర్–6 విభాగంలో కొత్తకోటకు చెందిన టి.యశ్విక 60 మీటర్లు, 150 మీటర్ల పరుగుపందెంలో ప్రథమ స్థానం సాధించింది. అదే విభాగంలో అప్పరాలకు చెందిన యు.కారుణ్య 60 మీటర్లు, 150 మీటర్ల పరుగుపందెంలో ద్వితీయ స్థానం దక్కించుకుంది. అండర్–8 విభాగంలో కొత్తకోటకు చెందిన టి.గగన్‌కుమార్‌రెడ్డి 200 మీటర్ల పరుగుపందెంలో తృతీయ స్థానంలో నిలిచాడు. అండర్–10 విభాగంలో అప్పరాలకు చెందిన వి.జోష్నవి 300 మీటర్ల పరుగుపందెంలో ప్రథమ స్థానం, యు.భావన బ్రాడ్ జంప్‌లో ద్వితీయ స్థానం పొందారు. అండర్–12 విభాగంలో అప్పరాలకు చెందిన వి.లేఖన 400 మీటర్ల పరుగుపందెంలో, జి.నందిని షాట్‌పుట్ పోటీలో తృతీయ స్థానాలు సాధించి రాష్ట్ర స్థాయి పోటీలకు అర్హత పొందారని వ్యాయామ విద్యా శిక్షకుడు ఎం.అజయ్‌కుమార్ తెలిపారు. విజేతలను స్థానిక ప్రజాప్రతినిధులు, క్రీడాభిమానులు అభినందిస్తూ రాష్ట్రస్థాయి పోటీల్లోనూ రాణించి జిల్లా, మండలానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.


