పశు వైద్యశాలల్లో సిబ్బంది కొరత ఉండటంతో అత్యవసర సమయంలో వైద్య సేవలు అందడం లేదు. అనారోగ్యానికి గురైన గొర్రెలను కాపాడుకోలేకపోతున్నాం. దీంతో గొర్రెలు, మేకల పెంపకందారులు ఆర్థికంగా నష్టపోతున్నారు పాలకులు వెంటనే ఖాళీలను భర్తీచేసి జీవాల ఇబ్బందులు తొలగించాలి.
– మల్లేష్, గొర్రెల పెంపకందారు, కొత్తకోట
గ్రామంలో పశుసంపద అధికంగా ఉంది. పశువుల దవాఖాన ఉన్నప్పటికీ శాశ్వత వైద్యుడు లేకపోవడంతో ఇన్‌చార్జితోనే సేవలు అందిస్తున్నారు. ఆయన ఎప్పడు వస్తారో తెలియదు. కంపౌండర్ పశువులకు వైద్యం చేస్తారు. అధికారులు స్పందించి శాశ్వత వైద్యుడిని నియమించాలి.
– ఎం.రాజు, సంకిరెడ్డిపల్లి, కొత్తకోట
పశువులకు వైద్యం చేయడానికి సరిపడా సిబ్బంది లేరు. దీంతో తామే తోచిన విధంగా చికిత్సలు చేసుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. ఒక్కోసారి పశువులు ప్రాణాలు కోల్పోతున్నాయి. ఇప్పటికై నా ప్రభుత్వం సిబ్బందిని పూర్తిస్థాయిలో నియమించాలి.– వెంకటయ్య,
పాడి రైతు, సూగూరు, పెబ్బేరు
●


