పశుసంవర్ధకశాఖలో సిబ్బంది కొరత ఉంది. వివిధ స్థాయిల్లో 40 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. దీంతో పశువైద్య సేవలు, రైతులకు అందించే పలు సంక్షేమ పథకాల అమలులో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. జిల్లాలోని పశువైద్యశాలలు, పశు ఆరోగ్య ఉపకేంద్రాలు, ఇతర కార్యాలయాల్లో సరిపడా సిబ్బంది లేక ప్రస్తుతం ఉన్న వారిపైనే అదనపు భారం పడుతోంది. ఖాళీలను భర్తీ చేయాలని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాం. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఖాళీల భర్తీకి ప్రభుత్వం చర్యలు చేపడుతున్నట్లు సమాచారం.
– వెంకటయ్యగౌడ్, ఇన్‌చార్జి జిల్లా పశువైద్యాధికారి


