అధికారులు అప్రమత్తంగా ఉండాలి.. | - | Sakshi
Sakshi News home page

అధికారులు అప్రమత్తంగా ఉండాలి..

Jul 31 2026 12:04 AM | Updated on Jul 31 2026 12:04 AM

అధికారులు అప్రమత్తంగా ఉండాలి..

భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించినట్లు కలెక్టర్‌ ఆదర్శ సురభి తెలిపారు. గురువారం హైదరాబాద్‌ నుంచి సీఎస్‌ సంజయ్‌ జాజు, డీజీపీ సీవీ ఆనంద్‌ అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్‌న్స్‌ నిర్వహించగా.. జిల్లా నుంచి కలెక్టర్‌తో పాటు ఎస్పీ సునీతారెడ్డి, అదనపు కలెక్టర్లు ఎన్‌.ఖీమ్యానాయక్‌, వినోద్‌కుమార్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ.. తహసీల్దార్లు తమ తమ మండలాల్లో అందుబాటులో ఉండాలని సూచించామన్నారు. ప్రజలకు ఏ విధమైన ఇబ్బందులు తలెత్తినా వెంటనే సహాయక చర్యలు అందించాలని చెప్పామని తెలిపారు. వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement