వనపర్తి రూరల్: జిల్లాకేంద్రంలోని కడుకుంట్ల, చిట్యాల ఎంజేపీ బీసీ గురుకుల జూనియర్ కళాశాలల్లో ప్రథమ సంవత్సరం బైపీసీలో మిగిలిన సీట్లకు ఆగస్టు 1న స్పాట్ అడ్మిషన్లు నిర్వహిస్తున్నామని డీసీఓ శ్రీవేణి, కళాశాల ప్రిన్సిపాల్ గురువయ్యగౌడ్ గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. రెండు కళాశాలల్లో కలిపి 12 సీట్లు ఖాళీగా ఉన్నాయని.. ఉదయం 9.30 నుంచి సాయంత్రం 4 వరకు ప్రవేశాల ప్రక్రియ కొనసాగుతుందని పేర్కొన్నారు. పదోతరగతిలో 450 లేదా అంతకంటే ఎక్కువ మార్కులు సాధించిన విద్యార్థులకు మొదటి ప్రాధాన్యం ఉంటుందని స్పష్టం చేశారు. తమ ఒరిజినల్ సర్టిఫికెట్లతో నేరుగా సంబంధిత కళాశాలలో హాజరై అడ్మిషన్ పొందవచ్చని సూచించారు. మరిన్ని వివరాలకు సెల్‌నంబర్ 91549 02278 సంప్రదించాలన్నారు.


