వనపర్తి: ఎస్‌ఐఆర్ ప్రక్రియ వందశాతం పూర్తి చేసేందుకు బీఎల్‌ఏలు సహకరించేలా రాజకీయ పార్టీలు చొరవ చూపాలని రెవెన్యూ అదనపు కలెక్టర్ టి.వినోద్‌కుమార్ కోరారు. బుధవారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. వనపర్తిలో ఎన్యూమరేషన్ ఫారాల డిజిటలైజేషన్ కేవలం 68 శాతమే పూర్తయిందని తెలిపారు. మిగిలిన వారు ఎవరు.. ఎక్కడున్నారో గుర్తించి ఎన్యూమరేషన్ ఫారాలు అందజేసే విధంగా చొరవ చూపాలన్నారు. 2026, అక్టోబర్, 1 నాటికి 18 ఏళ్లు నిండిన యువత ఫారం 6 ద్వారా ఇప్పుడే దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. పోలింగ్ కేంద్రాల రేషనలైజేషన్‌కుగాను ఇప్పటి వరకు 4 దరఖాస్తులు వచ్చాయని, ఏమైనా సమస్యలుంటే తెలియజేయాలని కోరారు. ఆర్డీఓ సు బ్రమణ్యం, తహసీల్దార్ రమేష్‌రెడ్డి, రాజకీయ పార్టీల ప్రతినిధులు తిరుపతయ్య, వే ణాచారి, గట్టుయాదవ్, కుమారస్వామి, పుట్టా ఆంజనేయులు, గంధం నాగరాజు, పాల్గొన్నారు.


