ఆశా.. నిరాశాయే.. | - | Sakshi
Sakshi News home page

ఆశా.. నిరాశాయే..

Jul 16 2026 5:00 AM | Updated on Jul 16 2026 5:00 AM

చాలీచాలని జీతం, ఉద్యోగ భద్రత కరువు కనీస వేతనం ఇవ్వాలి ఎల్లప్పుడూ అందుబాటులో.. మరో ఆందోళనకు.. రూ.10 వేలకు తగ్గకుండా.. 24 గంటలూ..

పెరిగిన పనిభారం

చాలీచాలని జీతం, ఉద్యోగ భద్రత కరువు

జిల్లాలో 548 మంది వర్కర్ల ఆవేదన

ఎన్నికల ముందు కాంగ్రెస్‌ పార్టీ హామీ ఇచ్చిన విధంగా ఆశావర్కర్లకు వెంటనే ఉద్యోగ భద్రత కల్పిస్తూ.. రూ.18 వేల ఫిక్స్‌డ్‌ వేతనం ఇవ్వాలి. ప్రస్తుత ధరలతో కుటుంబాలు గడవడం చాలా కష్టంగా ఉంది. వచ్చిన వేతనంతో పిల్లల చదువులు, కుటుంబం గడవడం లేదు. ఇప్పటికై నా ప్రభుత్వం తక్షణమే స్పందించాలి. – సునీత, ఆశావర్కర్స్‌

యూనియన్‌ జిల్లా అధ్యక్షురాలు

ఆరోగ్యపరంగా గర్భిణులతో పాటు బాలింతలకు ఎలాంటి ఇబ్బంది వచ్చినా ఎప్పటికప్పుడు మేము పర్యవేక్షిస్తూ సేవలు అందిస్తున్నాం. వారి ఆరోగ్య పరిస్థితిపై ఉన్నతాధికారులకు క్రమం తప్పకుండా నివేదిక సమర్పిస్తాం. చాలీచాలని వేతనాలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం. ప్రభుత్వం ఇచ్చిన హామీని నిలబెట్టుకొని మాకు న్యాయం చేయాలి.

– బుచ్చమ్మ, ఆశావర్కర్‌

ఆశా వర్కర్ల వేతనాలు పెంచకుంటే రాష్ట్ర వ్యాప్తంగా మరో ఆందోళనకు శ్రీకారం చుడతాం. ఆశాల విషయంలో ప్రభుత్వం ఇప్పటికే కాలయాపన చేస్తోంది. ఎన్నికల ముందు ఇచ్చిన హామీని కచ్చితంగా నిలబెట్టుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది.

– బొబ్బిలి నిక్సన్‌,

సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు

ఆశావర్కర్ల సమస్యలు, వారి డిమాండ్లపై ఇప్పటికే ప్రభుత్వానికి సమగ్ర నివేదిక సమర్పించాం. జిల్లావ్యాప్తంగా 15 మండలాల్లో 548 మంది ఆశాలు విధులు నిర్వహిస్తున్నారు. వేతనాల పెంపు అనేది ప్రభుత్వ పరిధిలోని నిర్ణయం. మా పరిధిలో ఉన్న పెండింగ్‌ సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తాం. ప్రతి ఆశా కార్యకర్తకు రూ.10 వేలకు తగ్గకుండా వేతనం అందేలా చూస్తున్నాం.

– సాయినాథ్‌రెడ్డి,

డీఎంహ్‌చ్‌ఓ, వనపర్తి

మదనాపురం: పని ఒత్తిడి, చాలీచాలని వేతనం, భరోసా లేని ఉద్యోగం వెరసి ఆశా కార్యకర్తలు తీవ్ర నిరాశలో విధులు నిర్వర్తిస్తున్నారు. ఆశాలకు ఉద్యోగ భద్రత కల్పించడంతో పాటు కనీస వేతనం చెల్లిస్తామని చెప్పి అధికారం చేపట్టి సుమారు మూడేళ్లవుతున్నా రాష్ట్ర ప్రభుత్వం తమను నిర్లక్ష్యంగా చూస్తుందని ఆశాలు ఆందోళన చెందుతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు వైద్య సేవలు అందిస్తూ నిత్యం రోగులకు అందుబాటులో ఉంటున్నారు. కరోనా లాంటి విపత్కర సమయంలో అన్ని శాఖలు లాక్‌డౌన్‌లోకి వెళ్లినా.. ప్రాణాలను పణంగా పెట్టి కరోనా సోకిన వారికి నిత్యం వైద్య సేవలు అందించినా తమకు కనీస గుర్తింపు దక్కలేదని వాపోతున్నారు. తమ శ్రమకు తగ్గట్టుగా రూ.18 వేల కనీస వేతనం అమలు చేయాలని ఏళ్లుగా వేడుకుంటున్నా వారి గోస వినే వారే కరువయ్యారు. ప్రభుత్వం స్పందిచకుంటే జిల్లావ్యాప్తంగా ఆశావర్కర్లు మరోసారి ఉద్యమబాట పట్టేందుకు సిద్ధమవుతున్నారు.

గ్రామాల్లో 24 గంటలు వైద్య సేవలు అందించాల్సి వస్తుందని ఆశాలు అంటున్నారు. గర్భిణులకు అర్ధరాత్రి ప్రసవ నొప్పులు వచ్చినా.. అత్యవసర వైద్య పరిస్థితులు తలెత్తినా కుటుంబాలను పక్కనబెట్టి బాధితులను ఆస్పత్రులకు తీసుకెళ్లే బాధ్యత ఆశా వర్కర్లదే. వారికి నిర్దిష్టమైన పని గంటలు లేవు. ప్రస్తుతం పెరిగిన నిత్యావసరాల ధరలతో వారికి ప్రభుత్వం చెల్లిస్తున్న రూ.9,600 వేతనం ఏమాత్రం చాలడం లేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

కేవలం క్షేత్రస్థాయి సేవలే కాకుండా, ప్రభుత్వం ప్రవేశపెడుతున్న ప్రతి కొత్త యాప్‌లో సమాచారాన్ని నమోదు చేయడం, ఆన్‌లైన్‌ నివేదికలు తయారు చేయడం వంటి అదనపు భారం వీరిపై పడింది. ఆరోగ్య రంగంలో ప్రాణాలకు తెగించి సేవలు అందిస్తున్నప్పటికీ వీరికి ఎలాంటి పీఎఫ్‌, ఈఎస్‌ఐ లేదా కనీస బీమా సదుపాయాలు లేవు. ప్రమాదవశాత్తు ఏదైనా జరిగితే కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి ఉంది. జిల్లాలోని 15 మండలాల్లో గల 14 పీహెచ్‌సీలు, 2 యూపీఎస్సీల పరిధిలో 548 మంది ఆశాలు పని చేస్తున్నారు. ప్రతి 1000 మంది జనాభా ఒక్కరు చొప్పున విధులు నిర్వహిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement