కొత్తకోట రూరల్: కాంగ్రెస్‌పార్టీ జిల్లా కార్యవర్గాన్ని 32 మందితో హైదరాబాద్‌లో టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేష్‌కుమార్‌గౌడ్ గురువారం ప్రకటించారు. ఉపాధ్యక్షులుగా పి.తిరుపతయ్య(రాజనగరం), సాయిచరణ్‌రెడ్డి(ఖిల్లాఘనపురం), ప్రధాన కార్యదర్శులుగా పాపయ్యగారి కృష్ణారెడ్డి (కొత్తకోట), పి.బ్రహ్మయ్యచారి (వనపర్తి), పి.ధనలక్ష్మి (వనపర్తి), ఎల్.సతీష్ (వనపర్తి), జి.గణేష్‌గౌడ్ (తాడిపర్తి, గోపాల్‌పేట), ఐ.సత్యారెడ్డి(పెద్దమందడి), అధికార ప్రతినిధులుగా చీర్ల జనార్దన్ (వనపర్తి), కోళ్ల వెంకటేష్ (వనపర్తి), రమేష్‌గౌడ్(జంగమాయపల్లి, పెద్దమందడి), జి.శరవంద(వనపర్తి), కార్యదర్శులుగా టి.రమేష్ ముదిరాజ్, బి.కృష్ణ(వనపర్తి), వెంకట్రాములుయాదవ్ (పెబ్బేరు), శ్రీహరిరాజు (శ్రీరంగాపురం), వాల్యానాయక్ (పెద్దగూడెం, వనపర్తి), పర్వతాలు(రేవల్లి), యాదగిరి నాయుడు(ఏదుల), వెంకటేష్‌సాగర్ (బునియాదిపురం, పెబ్బేరు), రియాజ్ (వనపర్తి), ఎన్‌జే బోయేజ్, (కొత్తకోట), సలీంఖాన్(కొత్తకోట), వేమన్న (మదనాపురం), జి.మన్యం (పెద్దమంద
డి), తులసీరాజుయాదవ్ (దేవరపల్లి, ఆత్మకూర్), విజయలక్ష్మి (వనపర్తి), రాములుయాదవ్, విజయ్‌కుమార్ (ఖిల్లాఘనపురం), కమర్‌మియా (వనపర్తి), ఆర్.సహదేవ్ (చందాపూర్), శివన్న (వనపర్తి) ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. పార్టీని సంస్థాగతంగా మరింత బలోపేతం చేయడానికి కొత్త కార్యవర్గం సమష్టిగా కృషి చేయాలని మహేష్‌కుమార్‌గౌడ్ సూచించినట్లు పార్టీ ప్రధానకార్యదర్శి కృష్ణారెడ్డి తెలిపారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని, పార్టీ సిద్ధాంతాలను గ్రామస్థాయికి చేర్చాలని, అలాగే రాబోయే ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని ప్రతి కార్యకర్త పనిచేసి పార్టీ విజయానికి కృషి చేయాలని చెప్పినట్లు వారు వివరించారు.


