మండల పరిషత్ పాలకవర్గం ఎన్నికలు జరగకపోవడంతో గ్రామంలో ఉన్న సమస్యలను ఎవరికీ చెప్పుకోలేకపోతున్నాం. మండల పరిషత్ ఉన్నట్టయితే ప్రతి మూడు నెలలకు ఒక పర్యాయం సమావేశం నిర్వహించేవారు. అలాంటి సమావేశంలో గ్రామ సమస్యలు ప్రస్తావించి పరిష్కరించుకునే అవకాశం ఉండేది. సర్పంచ్‌గా గెలిచినా గ్రామానికి కావాల్సిన నిధులు, అభివృద్ధి గురించి ఎవరినీ అడగలేని పరిస్థితి నెలకొంది.
– సాంబశివుడు, సర్పంచ్, మస్తీపురం,
అమరచింత మండలం
గతంలో మూడు నెలలకు ఒకసారి మండల సమావేశాలు జరిగేవి. ఆ సభల్లో గ్రామాలకు సంబంధించిన సమస్యలను సభ దృష్టికి తీసుకొస్తే అధికారులు వాటి పరిష్కారానికి చొరవ చూపేవారు. ప్రస్తుతం సరైన వేదిక లేకపోవడంతో సమస్యలు పరిష్కారం కావడం లేదు. అధికారులు స్పందించి సర్పంచులతోనైనా మండలస్థాయిలో ప్రత్యేక సమావేశాలు నిర్వహిస్తే బాగుంటుంది.
– రేగిచెట్టు నిరంజన్,
సర్పంచ్, రేమద్దుల (పాన్‌గల్)


