స్పందించిన జిల్లా యంత్రాంగం
వనపర్తి రూరల్: పెబ్బేరు మండలం వై శాఖాపూర్ సర్పంచ్ నిఖిత ఈ నెల 23న జిల్లా పర్యటనకు వచ్చిన రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మను కలెక్టరేట్‌లో కలిసి గ్రామ సమస్యలు పరిష్కరించాలంటూ వినతిపత్రం అందజేశారు. ఇందుకు స్పందించిన స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ యాదయ్య, ఎంపీఓ రోజ శనివారం గ్రామపంచాయతీ కార్యాలయంలో సర్పంచ్, ఉపసర్పంచ్, వార్డు సభ్యులు, గ్రామస్తులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా గ్రామంలో నెలకొన్న పలు సమస్యలను పాలకులు, గ్రామస్తులు అధికారుల దృష్టికి తీసుకొచ్చారు. పూర్తి వివరాలను ఉన్నతాధికారులకు తెలియజేస్తామని అధికారులు చెప్పారు.


