సైబర్.. టెర్రర్
622 ఫిర్యాదులు..
218 కేసులు
–8లో u
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: సైబర్ నేరగాళ్లు సామాజిక మాధ్యమాలే వేదికగా వల పన్ని దోపిడీకి పాల్పడుతున్నారు. ఆయా వర్గాల వ్యక్తుల బలహీనత అయిన అత్యాశను ఆసరాగా చేసుకుని రూ.కోట్లు కొల్లగొడుతున్నారు. రకరకాల పేర్లతో ఏపీకే లింక్‌లు పంపించి నిలువునా దోచుకుంటున్నారు. ఈ ఏడాది ఎక్కువగా ఆన్‌లైన్ ట్రేడింగ్ పేరిట యువత నుంచి భారీగా డబ్బులు తమ ఖాతాల్లోకి మళ్లించుకున్నారు. వారి మాయలో చిక్కుకున్న వారిలో అమాయకులే కాకుండా.. రైతులు మొదలుకొని విద్యాధికులు, రాజకీయ నాయకులు సైతం ఉన్నారు. ఈ క్రమంలో ఉమ్మడి పాలమూరు జిల్లాను సైబర్ మాయ కమ్మేసిన తీరుపై ‘సాక్షి’ క్రైం రౌండప్..
ఉమ్మడి పాలమూరులోని మహబూబ్‌నగర్, జోగుళాంబ గద్వాల, నారాయణపేట, వనపర్తి జిల్లాల పరిధిలో సైబర్ నేరాలకు సంబంధించి గతేడాది (2024)లో మొత్తం 3,003 ఫిర్యాదులు రాగా.. 236 కేసులు నమోదయ్యాయి. ప్రస్తుత 2025 సంవత్సరంలో 3,625 ఫిర్యాదులు అందగా.. 454 కేసులు నమోదైనట్లు అధికారిక రికార్డులు చెబుతున్నాయి. ఈ లెక్కన గతేడాదితో పోలిస్తే 622 ఫిర్యాదులు.. 218 కేసులు పెరిగినట్లు తెలుస్తోంది. గత సంవత్సరంలో నమోదైన కేసులతో పోలిస్తే మహబూబ్‌నగర్, జోగుళాంబ గద్వాల, నారాయణపేట, వనపర్తి జిల్లాల్లో సైబర్ నేరాల సంఖ్య అధికంగా ఉంది.
జిల్లాలో గణనీయంగా పెరిగిన సైబర్ నేరాలు
ఉమ్మడి పాలమూరులోని 4 జిల్లాల్లో ఇదే పరిస్థితి
ఈసారి మొత్తం 3,625 ఫిర్యాదులు.. 454 కేసులు నమోదు
అత్యధికంగా మహబూబ్‌నగర్‌లో.. అత్యల్పంగా వనపర్తిలో..
ఈ ఏడాది కేటుగాళ్లు కొల్లగొట్టింది రూ.9.29 కోట్లు
గతంతో పోల్చితే కాస్త మెరుగుపడిన రికవరీ
సైబర్.. టెర్రర్


