రేపు అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం
వనపర్తి: జిల్లాకేంద్రంలోని దాచ లక్ష్మయ్య ఫంక్షన్‌హాల్‌లో సోమవారం అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం నిర్వహించనున్నట్టు జిల్లా సంక్షేమ అధికారి కె.సుధారాణి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 10 గంటలకు కార్యక్రమం ప్రారంభమవుతుందని.. జిల్లా లోని దివ్యాంగులు, వారి సంక్షేమానికి పనిచేసే స్వచ్ఛంద సంస్థలు, సంఘ నాయకులు అధికసంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పేర్కొన్నారు.
ధాన్యం సేకరణలో నిర్లక్ష్యం తగదు
వనపర్తి రూరల్: రైతులు కేంద్రాలకు వరి ధాన్యం తీసుకొచ్చి 20 రోజులు గడుస్తున్నా నిర్వాహకులు కొనుగోలు చేయడం లేదని రాష్ట్ర పొలిటికల్ జేఏసీ చైర్మన్ రాచాల యుగంధర్‌గౌడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం పెబ్బేరు, మండలంలోని కంచిరావుపల్లి, శ్రీరంగాపురం మండలం నాగరాలలో ఆయన పర్యటించి రైతులతో మాట్లాడారు. పెబ్బేరులో సింగిల్‌విండో కార్యాలయాన్ని సందర్శించి జిల్లా పౌరసరఫరాలశాఖ అధికారులు, సింగిల్‌విండో అధికారులతో ధాన్యం సేకరణపై చర్చించారు. కార్యాలయంలో ముఖ్యమంత్రి చిత్రపటం లేకపోవడంపై సిబ్బందిని నిలదీశారు. కలెక్టర్ స్పందించి త్వరగా ధాన్యం కొనుగోలు చేసేలా చూడాలని, ప్రభుత్వ కార్యాలయాల్లో సీఎం ఫొటోలు ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో నాయకులు వీవీ గౌడ్, ధర్మేంద్రసాగర్, దేవర శివ, అస్కాని రమేష్, రమేశ్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
రామన్‌పాడుకు
నిలిచిన నీటి సరఫరా
మదనాపురం: మండలంలోని రామన్‌పాడు జలాశయానికి శనివారం జూరాల ఎడమ, సమాంతర కాల్వ ద్వారా నీటి సరఫరా నిలిచినట్లు ఏఈ వరప్రసాద్ తెలిపారు. ప్రస్తుతం జలాశయంలో సముద్రమట్టానికి పైన 1,020 అడుగుల నీటిమట్టం ఉందని.. ఎన్టీఆర్ కాల్వకు 620 క్యూసెక్కులు, కుడి, ఎడమ కాల్వలకు 35 క్యూసెక్కులు, తాగునీటి అవసరాలకు 20 క్యూసెక్కుల నీటిని వినియోగిస్తున్నట్లు వివరించారు.
‘ఉపాధిహామీ’
కొనసాగించాలి
గోపాల్‌పేట: కేంద్రంలోని మోదీ సర్కార్ తీసుకొచ్చిన వీబీజీ రాంజీ (వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్‌గార్ అండ్ అజివికా మిషన్ గ్రామీణ్) పథకాన్ని వెంటనే రద్దుచేసి మహాత్మాగాంధీ జాతీయ ఉపాధిహామీ పథకాన్ని కొనసాగించాలని సీపీఎం జిల్లా కార్యదర్శి ఆంజనేయులు డిమాండ్ చేశారు. శనివారం పార్టీ నాయకులు, కార్యకర్తలు కూలీలతో కలిసి పట్టణంలోని రావిచెట్టు నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించి కార్యాలయం ఎదుట నిరసన తెలిపి పలు డిమాండ్ల వినతిపత్రాన్ని తహసీల్దార్ తిలక్‌కుమార్‌రెడ్డికి అందజేశారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా నాయకులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు.
ఉత్సాహంగా
హ్యాండ్‌బాల్ ఎంపికలు
మహబూబ్‌నగర్ క్రీడలు: జిల్లాకేంద్రంలోని మెయిన్ స్టేడియంలో శనివారం స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఉమ్మడి జిల్లా అండర్–14 విభాగం హ్యాండ్‌బాల్ బాల, బాలికల ఎంపికలు నిర్వహించారు. ఎంపికలను జిల్లా ఎస్‌జీఎఫ్ కార్యనిర్వాహక కార్యదర్శి శారదాబాయి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎంపికై న జట్లు నారాయణపేటలో ఆదివారం నుంచి ఈ నెల 30 వరకు జరిగే ఎస్‌జీఎఫ్ రాష్ట్రస్థాయి అండర్–14 హ్యాండ్‌బాల్ టోర్నీలో పాల్గొంటాయని చెప్పారు. రాష్ట్రస్థాయి టోర్నీలో మెరుగైన ప్రతిభ కనబరిచి విజేతగా నిలవాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో పీడీలు వేణుగోపాల్, రవి, శంకర్, జియావుద్దీన్, ప్రదీప్, జ్ఞానేశ్వరి తదితరులు పాల్గొన్నారు.
రేపు అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం
రేపు అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం


