సమస్యల సాధనకు పోరాటం : సీపీఐ
ఆత్మకూర్: దేశం, రాష్ట్రంలోని సమస్యల సాధనకు ప్రజలు, రైతులు సమష్టిగా మరో పోరాటానికి సిద్ధం కావాలని సీపీఐ రాష్ట్ర నాయకుడు నర్సింహయ్యశెట్టి పిలుపునిచ్చారు. శుక్రవారం పార్టీ మండల కార్యదర్శి లక్ష్మీనారాయణశెట్టి అధ్యక్షతన పట్టణంతో పాటు మండలంలోని మూలమళ్ల, పిన్నంచర్లలో నిర్వహించిన శతజయంతి ఉత్సవాలకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరై పార్టీ జెండాలను ఆవిష్కరించిన అనంతరం మాట్లాడారు. 1925, డిసెంబర్ 26న సీపీఐ ఆవిర్భవించిందని, నాటి నుంచి నేటి వరకు దేశ ప్రజలకు అండగా నిలుస్తూ వలసవాదులైన బ్రిటీష్ వారిని దేశం నుంచి తరిమేయడంలో కీలకపాత్ర పోషించిందన్నారు. కార్యక్రమంలో నాయకులు రాబర్ట్, మోషా, లింగన్న, బాలకృష్ణ, ఆంజనేయులు, భాస్కర్, కుతుబ్, నాగరాజు, కురుమన్న, భీమన్న, చంద్రశేఖర్, లక్ష్మన్న, దాసు, బాలస్వామి, మల్లేష్, గోవర్దన్, చెన్నప్ప, ఆదాం, హనుమంతు పాల్గొన్నారు.


