ముగిసిన రాష్ట్రస్థాయి హాకీ పోటీలు
వనపర్తి రూరల్: మండలంలోని కడుకుంట్ల క్రీడా మైదానంలో కొనసాగిన ఎస్‌జీఎఫ్ అండర్–14 బాలికల రాష్ట్రస్థాయి హాకీ పోటీలు శుక్రవారం ముగిశాయి. చివరి మ్యాచ్‌లో మహబూబ్‌నగర్ జట్టుపై నిజామాబాద్ జట్టు 1–0 గోల్స్‌తో విజయం సాధించింది. ప్రథమ స్థానంలో నిజామాబాద్, ద్వితీయ స్థానంలో మహబూబ్‌నగర్, మూడో స్థానంలో హైదరాబాద్ జట్లు నిలిచాయని ఎస్‌జీఎప్ కార్యనిర్వాహక కార్యదర్శి ఎస్.నిరంజన్‌గౌడ్ తెలిపారు. గ్రామంలో హాకీ క్రీడలు నిర్వహించడానికి సహకరించిన గ్రామస్తులు, యువతకు కృతజ్ఞతలు తెలిపారు. విజేతలకు గ్రామ సర్పంచ్ తిరుపతయ్య, ఎంఈఓ మద్దిలేటి బహుమతులు అందజేసి మాట్లాడారు. యువత క్రీడలపై ఆసక్తి పెంపొందించుకొని జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించాలని కోరారు. కార్యక్రమంలో ఎస్‌జీఎఫ్ జిల్లా కార్యదర్శి బోలమోని కుమార్, పీడీ మన్యం, దాతలు తిరుమల్‌రెడ్డి, చీర్ల వెంకటసాగర్, మధుగౌడ్, చిన్నారెడ్డి, భాస్కర్, ,గ్రామస్తులు పాల్గొన్నారు.
ముగిసిన రాష్ట్రస్థాయి హాకీ పోటీలు


