ఆద్యంతం.. అయ్యప్ప నామం
జిల్లాకేంద్రంలో వైభవంగా సాగిన మండలపూజ
వనపర్తిటౌన్: జిల్లాకేంద్రంలోని రాజనగరంలో ఉన్న వీరశాస్త్ర అయ్యప్ప ఆలయంలో అయ్యప్ప సేవాసమితి ఆధ్వర్యంలో శుక్రవారం అయ్యప్ప మండలపూజ అంగరంగ వైభవంగా నిర్వహించారు. తెల్లవారుజామున మొదలైన పూజా కార్యక్రమాలు రాత్రి వరకు కొనసాగగా భక్తులు భారీసంఖ్యలో పాల్గొన్నారు. ఆలయ ప్రధాన అర్చకుడు రమేష్ సిద్ధాంతశర్మ, గురుస్వాములు అన్నంతో అయ్యప్పను తయారుచేసి ఆవాహించి వేదమంత్రోచ్ఛారణలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మూలవిగ్రహాన్ని అభిషేకించి ఆభరణాలతో అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. తర్వాత పల్లకీసేవ మేళతాళాల నడుమ భక్తిశ్రద్ధలతో జరిపించారు. మాలాధారులు, భక్తులకు అన్నప్రసాద వితరణ చేపట్టారు. రాత్రి 7 గంటలకు గురుస్వాములు అయ్యప్ప ఆల యం ఎదుట గల ఏకశిల పదునెట్టాంబడి పడి పూజ వైభవంగా నిర్వహించారు. రాత్రి 11.30 వరకు పూజ లు అల్పాహారం ఏర్పాటు చేశారు. పూజా కార్యక్రమాల్లో మాజీ ఎంపీ రావుల చంద్రశేఖర్‌రెడ్డి పాల్గొన్నారు. ఏటా మండల పూజ నిర్వహించే భాగ్యం దొరకడం అదృష్టంగా భావిస్తున్నట్లు పేర్కొన్నారు.
ఆభరణాలతో దర్శనమిచ్చిన
స్వామివారు
మార్మోగిన అయ్యప్ప నామస్మరణ
ఆద్యంతం.. అయ్యప్ప నామం


