అకాల వర్షం.. అపార నష్టం | - | Sakshi
Sakshi News home page

అకాల వర్షం.. అపార నష్టం

Apr 28 2025 12:26 AM | Updated on Apr 28 2025 12:26 AM

అకాల

అకాల వర్షం.. అపార నష్టం

ఆత్మకూర్‌: అకాల వర్షం అపార నష్టం తెచ్చిపెట్టింది. ఆదివారం సాయంత్రం ఉరుములు, మెరుపులతో వర్షం దంచి కొట్టింది, దీంతో కల్లాలు, మార్కెట్‌యార్డులోఆరబోసిన ధాన్యం తడిసి పోవడంతో పాటు వరద నీటిలో కొట్టుకుపోయింది. చెట్లు విరిగి రోడ్లు, తీగలపై పడటంతో విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది. అమరచింత–ఆత్మకూర్‌ మధ్యలో 33 కేవీ విద్యుత్‌ తీగలు తెగిపడ్డాయి. సకాలంలో ధాన్యం కొనుగోళ్లు చేయక, కొనుగోలు చేసిన ధాన్యం తరలించకపోవడంతో కష్టాలు తప్పడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. వరి పంటలు నేలకొరగగా.. మామిడి కాయలు రాలిపోయాయి. మండల కేంద్రంలో రహదారులన్నీ జలమయమయ్యాయి. గాంధీచౌక్‌లో వర్షపు నీరు నిలువడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. సంతలో కూరగాయలు కొట్టుకుపోయాయి.

తడసిన ధాన్యం.. నిలిచిన విద్యుత్‌ సరఫరా

అకాల వర్షం.. అపార నష్టం 1
1/2

అకాల వర్షం.. అపార నష్టం

అకాల వర్షం.. అపార నష్టం 2
2/2

అకాల వర్షం.. అపార నష్టం

Advertisement
 
Advertisement
Advertisement