అన్నివర్గాలకు సమన్యాయం..
ప్రజల భవిష్యత్‌కు భరోసా..
రాష్ట్ర పునర్నిర్మాణానికి పునాదిలా, ప్రజల భవిష్యత్‌కు భరోసానిచ్చేలా బడ్జెట్ ఉంది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం ఆర్థిక క్రమశిక్షణతో రెవెన్యూ ద్రవ్యలోటును తగ్గించే చర్యలు చేపట్టింది. వ్యవసాయం, రైతుభరోసాకు కేటాయించిన నిధులు రైతులకు ఎంతో మేలు చేస్తాయి. సాగునీటి రంగానికి రూ. 23వేల కోట్ల మేరకు కేటాయించడం శుభపరిణామం. మూలధన వ్యయాన్ని రూ. 36,504 కోట్లకు పెంచడం ద్వారా మౌలిక వసతులు పెరుగుతాయి. ఆరు గ్యారంటీల హామీల అమలుకు బడ్జెట్‌లో తగిన కేటాయింపులు జరపడం కాంగ్రెస్ ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనం. జీఎస్‌డీపీలో పర్యాటక రంగం వాటాను 10 శాతానికి పెంచడం, రూ.15 లక్షల కోట్ల పెట్టుబడులు ఆకర్షించడం ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా 3 లక్షల మందికి ఉపాఽధి కల్పించాలనే లక్ష్యాన్ని పెట్టుకున్నాం. 2030 నాటికి 10 కోట్ల మంది దేశీయ పర్యాటకులు, 5 లక్షల మంది అంతర్జాతీయ పర్యాటకులను ఆకర్షించడం ద్వారా తెలంగాణ ఖ్యాతిని విశ్వవ్యాప్తి చేయాలనే సంకల్పంతో ఉన్నాం.
– జూపల్లి కృష్ణారావు, రాష్ట్ర ఎకై ్సజ్, పర్యాటకశాఖ మంత్రి
అన్ని వర్గాలకు సమన్యాయం కల్పించేలా రాష్ట్ర బడ్జెట్ ఉంది. ఇంత పెద్ద మొత్తంలో బడ్జెట్ ప్రవేశ పెట్టడం ఆనందంగా ఉంది. ఇందిరమ్మ రాజ్యంలో పేదల సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పథకాలు అమలు చేస్తుంది. ఆర్థికమంత్రి భట్టి విక్రమార్క ప్రవేశపెట్టిన బడ్జెట్ రాబోయే పదేళ్లలో తెలంగాణ మరింత అభివృద్ధి దిశగా అడుగులేసేందుకు దోహదపడుతుంది. వైద్యం, విద్య, సాగునీటి పారుదల శాఖలకు నిధులు కేటాయించి ప్రాధాన్యత కల్పించింది. – వాకిటి శ్రీహరి, ఎమ్మెల్యే, మక్తల్
అన్నివర్గాలకు సమన్యాయం..


