చంద్రగఢ్ ఎత్తిపోతల కింద మూడు ఎకరాల్లో వరి సాగుచేసే వాడిని. మరమ్మతులకు గురికావడంతో రెండున్నర ఏళ్లుగా సాగునీటికి తీవ్ర ఇబ్బందులు పడ్డాం. ప్రస్తుతం సాగునీరు వదులుతుండటంతో వరి పైరుకు జీవం పోసినట్లయింది.
– ప్రభాకర్, రైతు, చంద్రగఢ్
మిగిలిన పథకాలు
బాగుచేయాలి..
చంద్రగఢ్ ఎత్తిపోతలకు చిన్న చిన్న మరమ్మతులు చేపట్టి యాసంగి పంటలకు నీరు అందించడం హర్షణీయం. రైతుల ప్రయోజనాలకు కాపాడేందుకు బెక్కర్‌పల్లి, నాగిరెడ్డిపల్లి ఎత్తిపోతల పథకాల మరమ్మతులకు సైతం నిధులు మంజూరు చేయాలి.
– రవి, రైతు, చంద్రగఢ్
ఎమ్మెల్యే చొరవతో ..
చంద్రగఢ్ ఎత్తిపోతల పథకం స్టార్టర్ కాలిపోయిందని ఎమ్మెల్యే వాకిటి శ్రీహరికి విన్నవించాం. సంబంధిత అధికారులతో మాట్లాడి అంచనాలు పంపడం, రూ.26 లక్షలు మంజూరు చేయించి పనులు పూర్తి చేయడం జరిగింది. ఆయకట్టుకు సాగునీరు అందించేందుకు ఎమ్మెల్యే చేసిన కృషి అభినందనీయం.
– సర్వారెడ్డి, అధ్యక్షుడు,
చంద్రగఢ్ ఎత్తిపోతల సంఘం
●
జీవం పోసినట్లయింది..
జీవం పోసినట్లయింది..