జిల్లాకేంద్రంలోని గంజి ప్రాంతంలో కూరగాయలు, మాంసం విక్రయాలకు అనువుగా రెండు అంతస్తుల్లో రూ.కోట్లు వెచ్చించి నిర్మించిన సమీకృత మార్కెట్‌యార్డ్ నిరుపయోగంగా మారింది. గాంధీచౌక్, హనుమాన్ టేకిడీ, శంకర్‌గంజ్, కమాన్ చౌరస్తా, పాత బస్టాండ్, కొత్త బస్టాండ్ తదితర ప్రాంతాల్లో చిరు వ్యాపారులు కూరగాయలు విక్రయిస్తూ జీవనం సాగిస్తున్నారు. అదేవిధంగా చేపలు, మాంసం విక్రయాలు కూడా సుమారు 10 ప్రాంతాల్లో కొనసాగుతున్నాయి. వీరందరినీ సమీకృత మార్కెట్‌యార్డుకు తరలించాల్సి ఉన్నా నేటికీ అడుగులు పడటం లేదు. రూ.కోట్లు వెచ్చించిన భవనం అలంకారప్రాయంగా మారింది.


