ప్రారంభమైన ఇంటర్ పరీక్షలు
వనపర్తి విద్యావిభాగం: జిల్లావ్యాప్తంగా ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం వార్షిక పరీక్షలు బుధవారం ప్రారంభమయ్యాయి. 14 మండలాల్లో 25 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు డీఐఈఓ ఎర్ర అంజయ్య తెలిపారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 వరకు పరీక్ష జరగగా 6,714 మంది విద్యార్థులకుగాను 6,476 మంది హాజరుకాగా.. 238 మంది గైర్హాజరైనట్లు వివరించారు. పాన్‌గల్‌లోని పరీక్ష కేంద్రాన్ని రెవెన్యూ అదనపు కలెక్టర్ జి.వెంకటేశ్వర్లు తనిఖీ చేశారు. ఎలాంటి అవాంచనీయ ఘటనలు చోటు చేసుకోకుండా కేంద్రాల పరిసరాల్లో బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఎస్పీ రావుల గిరిధర్ తెలిపారు.
ప్రారంభమైన ఇంటర్ పరీక్షలు
ప్రారంభమైన ఇంటర్ పరీక్షలు


