విఘ్నరాజా.. వినాయక | Sakshi
Sakshi News home page

విఘ్నరాజా.. వినాయక

Published Mon, Sep 18 2023 1:28 AM

ఆత్మకూర్‌లో వినాయక విగ్రహాలను తీసుకెళ్తున్న యువకులు  - Sakshi

వివరాలు 8లో u

నేడు కొలువుదీరనున్న గణనాథులు

వనపర్తిటౌన్‌/ఆత్మకూర్‌: నేడు వినాయక చవితి. రంగురంగుల బొజ్జ గణపయ్యలు సోమవారం మండపాల్లో కొలుదీరనున్నారు. ఇందుకోసం నిర్వాహకులు మండపాలను సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. వనపర్తి పోలీస్‌శాఖ పరిధిలో ఇప్పటి వరకు 100కు పైగా విగ్రహాల ఏర్పాటుకు నిర్వాహకులు అనుమతులు పొందారు. కాలనీల్లో చిన్నారులు చిన్న, చిన్న వినాయక విగ్రహాలు ఏర్పాటుకు సన్నద్ధమయ్యారు. మండపాల ఎదుట 20 నుంచి 60 అడుగుల మేర రంగురంగుల విద్యుద్ధీపాలను ఏర్పాటు చేశారు. నాలుగు అడుగుల నుంచి 16 అడుగుల ఎత్తున విగ్రహాలు కొలువుదీరనున్నాయి. ఇదిలా ఉండగా.. రాత్రి పది గంటలలోపే పూజలు, భజన, సాంస్కృతిక కార్యక్రమాలు పూర్తి చేయాలని, అనుమతి తీసుకొని విద్యుత్‌ వినియోగించుకోవాలని పోలీసు, విద్యుత్‌ ఉన్నతాధికారులు ఇదివరకే సూచించారు. జిల్లాకేంద్రంలో ప్రధానంగా వ్యవసాయ మార్కెట్‌, శంకర్‌గంజ్‌, గాంఽధీచౌక్‌, యూకోబ్యాంకు, రాజీవ్‌చౌక్‌, బస్‌డిపో రోడ్‌, వేంకటేశ్వర ఆలయంలోని ప్రతిమలే ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. అలాగే పట్టణంలోని టీచర్స్‌కాలనీ, వెంగళ్‌రావునగర్‌, శాంతినగర్‌, పీర్లగుట్ట, బ్రహ్మణవీధి, బ్రహ్మంగారివీధి, పాతబజార్‌, జమ్మిచెట్టు, 40 ఫీట్ల రోడ్డు, రాంనగర్‌, రామాలయం, చందాపూర్‌రోడ్డు, ప్రజావైద్యశాల, వల్లభ్‌నగర్‌, బండారునగర్‌, శ్వేతనగర్‌, ఆర్టీసీ కాలనీ, న్యూటౌన్‌కాలనీ, నందిహిల్స్‌, సుభాష్‌వాడ, గణేష్‌నగర్‌, హనుమాన్‌టేకిడీ, కేడీఆర్‌నగర్‌, బసవన్నగడ్డ, దళితవాడ, రాయిగడ్డ, అంబేడ్కర్‌ యూత్‌ తదితర ఒక్కో ప్రాంతంలో 3 నుంచి 4 విగ్రహాలు ఏర్పాటు చేయనున్నారు.

కిక్కిరిసిన రోడ్లు..

పండుగను పురస్కరించుకొని ఆదివారం జిల్లాకేంద్రంలోని రహదారులు, దుకాణాలు కొనుగోలుదారులతో కిటకిటలాడాయి. పూజకు అవసరమయ్యే మారేడు దళాలు, వెలగపండ్లు, వివిధ రకాల ఆకులు, దీపపు ప్రమిదలు, బంతిపూలు, పూలదండలు రహదారులకు ఇరువైపులా విక్రయించడం కనిపించింది. మండపాల ముస్తాబుకు సంబంధించిన ప్లాస్టిక్‌ పూలు, పుష్పగుచ్ఛాలు, తోరణాలు, కవర్లు, రంగురంగుల డెకరేషన్‌ క్లాత్‌లు తదితర వాటి కొనుగోలుదారులతో జనరల్‌ స్టోర్‌లు నిండిపోయాయి. విగ్రహాల ఏర్పాటుకు సహకరించిన రాజకీయ నాయకులు, దాతల పేరిట ఫ్లెక్సీలు వేయించేందుకు సైతం నిర్వాహకులు బారులు తీరారు.

జిల్లాకేంద్రంలో వినాయక విగ్రహాల విక్రయం
1/3

జిల్లాకేంద్రంలో వినాయక విగ్రహాల విక్రయం

ఆత్మకూర్‌ బీసీకాలనీలో ఏర్పాటుచేసిన 
భారీ విగ్రహం
2/3

ఆత్మకూర్‌ బీసీకాలనీలో ఏర్పాటుచేసిన భారీ విగ్రహం

వనపర్తిలో ముస్తాబైన మండపం
3/3

వనపర్తిలో ముస్తాబైన మండపం

Advertisement
 
Advertisement