భామిని: స్థానిక ఏకలవ్య మోడల్ స్కూల్(ఈఎంఆర్‌ఎస్) విద్యార్థులు నీరు మోసే కూలీలుగా గురువారం మారారు. ఈఎంఆర్‌ఎస్ నుంచి సుమారు రెండు ఫర్లాంగుల దూరంలోని ఏపీజీవీ బ్యాంక్ ఎదురుగా ఉన్న చేతిపంపులోని నీరు కొట్టి, క్యాన్లతో ఆటోలో ఎక్కించే పనిలో తలమునకలయ్యారు. ఉదయం నుంచి విద్యుత్ సరఫరా లేక పోవడంతో మంచినీటి కోసం విద్యార్థులను తెచ్చామని సిబ్బంది సర్ది చెప్పి దబాయించారు. ఏకలవ్య విద్యార్థులు నీరు కొడుతుంటే స్థానికులు ఆసక్తిగా తిలకించారు.కనీసం ఏకలవ్య స్కూల్‌లో తాగునీరు వసతి లేక పోవడం, కాంట్రాక్టర్ నీటి సరఫరా కూడా చేయక పోవడంపై విమర్శలు వచ్చాయి.


