గంజాయి కేసులో నిందితుడిపై పీడీయాక్ట్‌ | - | Sakshi
Sakshi News home page

గంజాయి కేసులో నిందితుడిపై పీడీయాక్ట్‌

Sep 25 2026 1:41 AM | Updated on Sep 25 2026 1:41 AM

విజయనగరం టౌన్‌: గంజాయికి సంబంధించి పలు కేసుల్లో నిందితుడిగా, రౌడీషీటర్‌గా ఉన్న గాబు దుర్గారావుపై పీడీయాక్ట్‌ ప్రయోగించినట్లు ఎస్పీ ఏఆర్‌.దామోదర్‌ స్పష్టం చేశారు. ఈ మేరకు గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. గాబు దుర్గారావుపై గంజాయికి సంబంధించి పలు కేసులు ప్రస్తుతం పలు న్యాయస్థానాల్లో విచారణలో ఉన్నాయని, అలాగే వన్‌టౌన్‌ పోలీస్‌స్టేషన్‌లో రౌడీషీట్‌ ఉందన్నారు. గడిచిన ఏడాది కాలంలో 17 మందిపై పీడీయాక్ట్‌ ప్రయోగించి, ఏడాదిపాటు బెయిల్‌పై విడుదల కాకుండా జైలుకు పంపించామన్నారు. చట్టాన్ని తరచూ ఉల్లంఘిస్తూ, ప్రజాశాంతికి భంగం కలిగిస్తూ, సమాజానికి ప్రమాదకరంగా మారుతూ గంజాయి రవాణా, విక్రయాలు, వినియోగానికి పాల్పడుతున్న విజయనగరం జిల్లా భోగాపురం మండలం రెడ్డికంచేరుకు చెందిన గాబు దుర్గారావు (37)పై పీడీ యాక్ట్‌ ప్రయోగించి నిందితుడ్ని అదుపులోకి తీసుకుని, ఏడాది పాటు బెయిల్‌ మంజూరుకాకుండా చేసి, విశాఖ కేంద్ర కారాగారానికి తరలించామన్నారు. నిందితులు నేర ప్రవృత్తిని విడనాడాలని, చట్టాన్ని గౌరవిస్తూ, సత్ప్రవర్తనతో జీవించాలని, లేకుంటే కఠినచర్యలు తప్పవని హెచ్చరించారు.

లారీని ఢీకొన్న టిప్పర్‌: టిప్పర్‌ క్లీనర్‌ మృతి

● టిప్పర్‌ డ్రైవర్‌కు తీవ్ర గాయాలు

ఆస్పత్రికి తరలింపు

దత్తిరాజేరు: మండలంలోని పెదమనాపురంలో పోలీస్‌ స్టేషన్‌కు కూత వేటు దూరంలో గురువారం తెల్లవారు జామున జాతీయ రహదారిపై కొత్తగా ప్రారంభించిన వంతెన వద్ద ఎదురెదురుగా వస్తున్న లారీ, టిప్పర్‌ ఢీకొనడంతో టిప్పర్‌ క్లీనర్‌ పడాల లక్షు సంఘటన స్థలంలోనే మృతి చెందాడు. ఈ మేరకు ఎస్సై కళాధర్‌ తెలిపిన వివరాల ప్రకారం బొబ్బిలి నుంచి వైజాగ్‌ వెళ్తున్న టిప్పర్‌ గజపతినగరం నుంచి రాయ్‌పూర్‌ వెళ్తున్న లారీ ఢీకొనడంతో గుర్ల మండలంలోని పెదబంటుపల్లి గ్రామానికి చెందిన టిప్పర్‌ క్లీనర్‌ పడాల లక్ష్ము(60)మృతి చెందగా గుర్ల మండలం లవిడాంకు చెందిన టిప్పర్‌ డ్రైవర్‌ వై.తిరుపతికి తీవ్ర గాయాల పాలడంతో విజయనగరంలోని సర్వజన ఆస్పత్రికి తరలించారు. లారీ డ్రైవర్‌ స్వల్ప గాయాలతో బయట పడ్డాడు. మృతుడి కుమారుడు సత్యనారాయణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై కళాధర్‌ చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement