వైద్య రంగంలో ఫార్మసిస్టుల పాత్ర కీలకం | - | Sakshi
Sakshi News home page

వైద్య రంగంలో ఫార్మసిస్టుల పాత్ర కీలకం

Sep 25 2026 1:41 AM | Updated on Sep 25 2026 1:41 AM

వైద్య రంగంలో ఫార్మసిస్టుల పాత్ర కీలకం

విజయనగరం ఫోర్ట్‌: వైద్యరంగంలో ఫార్మసిస్టుల పాత్ర చాలా కీలకమైనది. వైద్యుల తర్వాత అంతటి ప్రాధాన్యం వారిదే. రోగి వ్యాధి తగ్గించడంలో వైద్యుడి పాత్ర ఎంత ఉంటుందో, ఫార్మసిస్టు పాత్ర అంతే ఉంటుంది. రోగిని పరీక్షంచిన వైద్యుడు వ్యాధి తగ్గడానికి అవసరమైన మందులు రాసి ఇస్తారు. వైద్యుడు సూచించిన మందులను చూసి మార్చకుండా కచ్చితమైన మందులు అందిచేది ఫార్మసిస్టులే. శుక్రవారం ప్రపంచ ఫార్మసిస్టుల దినోత్సవం సందర్భంగా సాక్షి అందిస్తున్న ప్రత్యేక కధనం. రోగికి మందులు అందించడం ద్వారా ఫార్మసిస్టులు వ్యాధిని తగ్గిస్తారు. అయితే మందులు అందించడంలో ఫార్మసిస్టులు అత్యంత అప్రమత్తంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంటుంది. వైద్యులు సూచించిన మందులు ఒకదానికి బదులు ఇంకొకటి ఇచ్చినా కాలపరిమితి దాటిన మందులు అందించినా రోగుల ప్రాణాల మీదికి వస్తుంది. కోవిడ్‌ సమయంలో ఫార్మసిస్టులు వైద్యులతో సమానంగా వారితో కలిసి కోవిడ్‌ బారిన పడిన వారికి మందులు అందించారు. ప్రపంచంలో మొదటిసారి 2009 సెప్టెంబర్‌ 25న ఫార్మసిస్టుల దినోత్సవాన్ని నిర్వహించారు. భారత దేశంలో 2013లో ఫార్మసీ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా సెప్టెంబర్‌లో పార్మసిస్టుల దినోత్సవాన్ని నిర్వహించేందుకు అనుమతి ఇచ్చింది. 2014 సెప్టెంబర్‌ 25నుంచి మన దేశంలో ఫార్మసిస్టుల దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు.

ఫార్మసిస్టులు చేసే పనులు

మందులు నిల్వ చేస్తారు. అదేవిధంగా వ్యాక్సిన్‌ను నిర్దేశించిన ఉష్ణోగ్రత లో నిల్వ చేయడం, సెంట్రల్‌ డ్రగ్‌ స్టోర్స్‌లో పనిచేసే ఫార్మసిస్టులు పీహెచ్‌సీ, సీహెచ్‌సీ, ఏరియా ఆస్పత్రి, జిల్లా ఆస్పత్రుల్లో పనిచేసే ఫార్మసిస్టులు వైద్యులు రాసి ఇచ్చిన చీటీ ప్రకారం రోగులకు మందులు అందిస్తారు. అదేవిధంగా ఆయా ఆస్పత్రులకు ఎన్ని రకాల మందులు కావాలి, ఎంతకావాలో ఆన్‌లైన్‌లో ఇండెంట్‌ పెడతారు. మందులు ఇచ్చే ముందు రోగులకు ఫార్మసిస్టులు కౌన్సెలింగ్‌ ఇస్తారు. ఏరకం మందు ఏసమయంలో ఎంత మోతాదులో వేసుకోవాలో వివరంగా తెలియజేస్తారు.

జిల్లాలో 1500 మందికి పైగా ఫార్మసిస్టులు

జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేట్‌ ఆస్పత్రులు, మందులు దుకాణాలు అనేకం ఉన్నాయి. పీహెచ్‌సీలు 50, పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు 18, సీహెచ్‌సీలు, ఏరియా ఆస్పత్రులు ఏడు, బోధనాస్పత్రి, ఘోషా ఆస్పత్రి చెరొకటి ఉన్నాయి. 800 వరకు మందుల దుకాణాలు ఉన్నాయి. 200 నుంచి 300 వరకు క్లినిక్స్‌, నర్సింగ్‌ హోమ్స్‌ ఉన్నాయి. వాటిలో 1500 మందికి పైగా ఫార్మసిస్టులు పనిచేస్తున్నారు.

నేడు ప్రపంచ ఫార్మసిస్టుల దినోత్సవం

రోగులకు అర్థం అయ్యే విధంగా చెప్పాలి

జిల్లా ఆస్పత్రికి, బోధనాస్పత్రికి రోగులు ప్రతి రోజూ వేలాది మంది వస్తారు. అయితే తొందరగా వెళ్లిపోవాలనే అలోచనతో వారు మందులు త్వరగా ఇవ్వాలని అడుగుతుంటారు. అటువంటి వారి పట్ల చిరాకు పడడం, విసుక్కోవడం చేయకూడదు. ఓపిగ్గా వారికి అర్థమయ్యే విధంగా అవి ఏ విధంగావాడాలో చెప్పాలి. వృద్ధులు, దివ్యాంగులకు త్వరగా మందులు అందించాలి. ఫార్మసిస్టులు ఆరోగ్య రంగంలో మూలస్తంభం లాంటి వారు. మందులు అందించడం ద్వారా ప్రజలకు సేవచేసే అదృష్టాన్ని భగవంతుడు తమకు ఇచ్చిన వరంగా ప్రతి ఫార్మసిస్టు భావించాలి.

బమ్మిడి నరసింగరావు,

ఫార్మసీ ఆఫీసర్‌, ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement