జాతీయ పోటీలకు పయనం | - | Sakshi
Sakshi News home page

జాతీయ పోటీలకు పయనం

Sep 25 2026 1:41 AM | Updated on Sep 25 2026 1:41 AM

జాతీయ పోటీలకు పయనం

బొబ్బిలి: మహారాష్ట్రలో ఈనెల 29 నుంచి మూడు రోజుల పాటు జరగనున్న 13వ సాఫ్ట్‌బాల్‌ జాతీయస్థాయి పోటీలకు రాష్ట్ర జట్టు గురువారం బొబ్బిలిలో బయలుదేరింది. ఈ పోటీల కోసం ఇప్పటికే మండలంలోని పారాది జెడ్పీ ఉన్నత పాఠశాలలో కోచింగ్‌ క్యాంపు నిర్వహించారు. వారం రోజుల పాటు ప్రాక్టీస్‌ చేసిన జట్టుకు ఎమ్మెల్యే బేబీ నాయన ఆర్థిక సహాయం చేశారని నిర్వాహకులు తెలిపారు. సాఫ్ట్‌బాల్‌ అభివృద్ధి సంఘ ఉపాధ్యక్షుడు సుంకరి సాయిరమేష్‌, అల్లాడ భాస్కర రావు, పీడీ నల్ల వెంకటనాయుడు, కోచ్‌ బద్రి దుర్గాప్రసాద్‌ తదితరులు జట్టుకు బెస్టాఫ్‌ లక్‌ తెలిపి సాగనంపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement