లక్కవరపుకోట (శృంగవరపుకోట): శృంగవరపుకోట మండలం మామిడిపల్లి గ్రామానికి చెందిన మండ త్రినాథ్, మండ సుగుణ, నాగులపల్లి జగన్నాథం తదితర 25 కుటుంబాల వారు శాసన మండలి విపక్ష నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ, నియోజకవర్గం సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావుల సమక్షంలో వైఎస్సార్‌సీపీలో శనివారం చేరారు. ఈ సందర్భంగా బొత్స సత్యనారాయణ, కడుబండి శ్రీనివాసరావులు మాట్లాడుతూ వైఎస్‌ఆర్‌సీపీకి కార్యకర్తలే ముఖ్యమన్నారు.వారి భవిష్యత్తును తీర్చిదిద్దే బాధ్యత పార్టీ తీసుకుంటుందని భరోసా ఇచ్చారు.పార్టీ పూర్వ వైభవానికి కృషి చేయాలని చూచించారు. పార్టీ ఎప్పడు అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.కార్యక్రమంలో గ్రామ మాజీ సర్పంచ్ సీహెచ్. రమణ, పార్టీ నాయుకుడు కిలారి రవి, ఎమ్మెల్సీ కుంభా రవిబాబు, పార్టీ సీనియర్ నాయకుడు రొంగలి జగన్నాథం తదితరులు పాల్గొన్నారు.


