భామిని: పత్తి పంటలో పురుగు మందు కొట్టడానికి శనివారం వెళ్లిన రైతు పాముకాటుకు గురై పొలంలోనే మృతి చెందడంతో నేరడి–బి గ్రామంలో విషాదం అలుముకుంది. భామిని మండలం నేరడి–బికి చెందిన రైతు సరిసాభద్ర మిన్నారావు(60) పత్తి పొలంలో పొడ పాము కాటుకు గురై మృత్యువాత పడ్డాడు. ఈ విషయం తెలుసుకున్న సమీప రైతులు పరుగున వెళ్లి గాయ పడిన రైతు మిన్నారావు(60)ను భామిని ప్రభుత్వాస్పత్రికి తరలించగా అప్పటికే మరణించినట్లు వైద్యులు నిర్ధారించిన అనంతరం మృతదేహాన్ని స్వగ్రామానికి తరలించి అంతిమ సంస్కారాలు నిర్వహించారు. మృతుడికి భార్య పగడాలు, కొడుకు ఖగేశ్వరరావు, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు.రైతు మృతితో నేరడి, గురండి, బిల్లుమడ గ్రామాల నుంచి ప్రజలు తరలివచ్చి విషాదానికి గురై సంతాపం తెలిపారు.


