● కలెక్టర్ రాంసుందర్ రెడ్డి
విజయనగరం ఫోర్ట్: ఒకరి నేత్రదానంతో ఇద్దరు అంధులకు చూపును ప్రసాదించవచ్చని కలెక్టర్ రాంసుందర్‌రెడ్డి అన్నారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఈ నెల 25వ తేదీ నుంచి నిర్వహించనున్న నేత్రదాన పక్షోత్సవాలకు సంబంధించిన కరపత్రాలను సోమవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 15 రోజుల పాటు నేత్రదానంపై ప్రజల్లో అవగాహన కల్పించాలన్నారు. ఎక్కవ మంది నేత్రదానం చేసేందుకు ముందుకు వచ్చేలా చూడాలన్నారు. కార్యక్రమంలో జేసీ సేతుమాధవన్, ఇన్‌చార్జి డీఆర్వో కె.అరుణకుమారి, డీఎంహెచ్‌ఓ జీవనరాణి, డీఎల్‌ఓ కె.రాణి, డీసీహెచ్‌ఎస్ పద్మశ్రీరాణి, జిల్లా అఽంధత్వ నివారణ కార్యక్రమం ప్రొగ్రాం అధికారి కె.త్రినాథరావు, తదితరులు పాల్గొన్నారు.


