● తాగునీటి పథకాల్లో క్లోరినేషన్ సక్రమంగా
జరగడం లేదనే ఆరోపణలు
● తాగునీటి కుళాయిల నుంచి బురదనీరు సరఫరా
తాగునీటి పథకం
విజయనగరం ఫోర్ట్: జిల్లాలో తాగునీటి పథకాలు 981 ఉన్నాయి. వీటిలో ఒక్క గ్రామానికి తాగునీరు అందించే పథకాలు 951, ఒకటి కంటే ఎక్కువ గ్రామాలకు తాగునీరు అందించే పథకాలు 30 ఉన్నాయి. చాలా గ్రామాల్లో కుళాయిల నుంచి బురదనీరు సరఫరా అవుతుండడం ప్రజలను ఆందోళనకు గురిచేస్తోంది. తాగునీటి పథకాలను శుభ్రం చేయడంలేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. కుళాయిల నుంచి సరఫరా అవుతున్న కలుషిత నీటిని తాగితే అనారోగ్యం బారిన పడుతామని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గుర్లలో గతేడాది కలుషిత నీరు తాగడం వల్లే డయేరియా ప్రబలి 14 మంది వరకు మృత్యువాత పడ్డారు. అటువంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే సురక్షితమైన నీటిని అందించాలని కోరుతున్నారు.
క్లోరినేషన్ తప్పనిసరి
ప్రతిరోజు క్లోరినేషన్ చేసి తాగునీరు సరఫరా చేయాలి. ప్రతి 15 రోజులకు ఒకసారి వాటర్ ట్యాంక్‌లను క్లీన్‌చేయాలి. నిబంధనలకు విరుద్ధంగా ఎక్కడైనా వ్యవహరిస్తే సంబంధిత సిబ్బందిపై చర్యలు తీసుకుంటాం. – కవిత, ఎస్‌ఈ, ఆర్‌డబ్ల్యూఎస్


