● సంకిలి గ్రామ రైతుల ఆందోళన
రేగిడి: మండల పరిఽధిలోని సంకిలి వద్ద ఉన్న ఈఐడీ ప్యారీ చక్కెర కర్మాగారం వ్యర్థాలతో పంటపొలాలు పాడవతున్నాయని సంకిలికి చెందిన పలువురు రైతులు బుధవారం ఆందోళన చేశారు. గ్రామానికి చెందిన నాయుడు చెరువు ఆయకట్టు పరిధిలో 60 ఎకరాలు డ్రమ్ సీడర్ విధానంలో వరి పంట వేశామని, జలకాలుష్యం వల్ల విత్తనాలు మొలకెత్తలేదన్నారు. సమస్యపై స్పందించిన కర్మాగారానికి చెందిన హెచ్‌ఆర్ మేనేజర్ ప్రవీణ్ వర్మ పంట పొలాల్లోకి వెళ్లి పరిశీలించారు. మొలకెత్తని విత్తనాలను రైతులు ఆయనకు చూపించారు. ఈ సమస్యను యాజమాన్యం దృష్టికి తీసుకువెళ్లి రైతులకు నష్టం వాటిల్లకుండా చూస్తామన్నారు. న్యాయం చేయకపోతే జిల్లా యంత్రాంగం దృష్టికి సమస్యను తీసుకెళ్తామని రైతులు గంగు కృష్ణారావు, పి.గోపాల్, పప్పల సూర్యారావు, ఇప్పలి పట్టాభి, బి.హరినాథ్, తదితరులు స్పష్టంచేశారు.


