బంద్‌ విజయవంతం | - | Sakshi
Sakshi News home page

బంద్‌ విజయవంతం

Jul 25 2026 12:59 AM | Updated on Jul 25 2026 12:59 AM

విజయనగరం గంటస్తంభం: నీట్‌ ప్రశ్నపత్రం లీకేజీకి నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ రాజీనామా చేయాలని డిమాండ్‌ చేస్తూ విద్యార్థి, యువజన సంఘాల పిలుపు మేరకు జిల్లా వ్యాప్తంగా శుక్రవారం నిర్వహించిన విద్యా సంస్థల బంద్‌ విజయవంతమైంది. విద్యార్థులు స్వచ్ఛందంగా తరగతులు బహిష్కరించి బంద్‌కు మద్దతు తెలిపారు. ఎస్‌ఎఫ్‌ఐ, ఏఐఎస్‌ఎఫ్‌, డీవైఎఫ్‌ఐ, ఏఐవైఎఫ్‌ ఆధ్వర్యంలో విద్యార్థులు, యువజనులు నగరంలోని కోట కూడలిలో రాస్తారోకో నిర్వహించి కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. నీట్‌ లీకేజీ వల్ల లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిందని, కేంద్ర ప్రభుత్వం బాధ్యత వహించాలని డిమాండ్‌ చేశారు. ఈ సందర్భంగా ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్షుడు పూడి రామ్మోహన్‌, ఏఐఎస్‌ఎఫ్‌ రాష్ట్ర సహాయ కార్యదర్మి నాగభూషణం, డీవైఎఫ్‌ఐ జిల్లా కన్వీనర్‌ హరీష్‌, ఏఐవైఎఫ్‌ జిల్లా కన్వీనర్‌ వాసు మాట్లాడుతూ.. ప్రశ్నపత్రాల లీకేజీలను అరికట్టడంలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. నిరసన తెలిపే విద్యార్థులపై పోలీసులు కఠినంగా వ్యవహరించడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమన్నారు. గత పన్నెండు సంవత్సరాల్లో దేశవ్యాప్తంగా అనేక పోటీ పరీక్షల ప్రశ్నపత్రాలు లీక్‌ కావడం ప్రభుత్వ వైఫల్యానికి నిదర్మనమని పేర్కొన్నారు. నీట్‌ లీకేజీపై రాష్ట్రంలోని అధికార, ప్రతిపక్ష పార్టీలు స్పందించాలని డిమాండ్‌ చేశారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే ధర్మేంద్ర ప్రధాన్‌ను పదవి నుంచి తొలగించి, పరీక్షల నిర్వహణలో పారదర్మకత తీసుకురావాలని కోరారు. లేదంటే విద్యార్ధి ఉద్యమాలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్మి డి.రాము, నాయకులు భారతి, సూరిబాబు, గుణ, జయ, ఏఐఎస్‌ఎఫ్‌ జిల్లా కార్యదర్మి సుమన్‌, నాయకులు చరణ్‌, గణేష్‌, డీవైఎఫ్‌ఐ నాయకులు జె.రవికుమార్‌, లోకేష్‌, తదితరులు పాల్గొన్నారు.

నీట్‌ లీకేజీపై నిరసన తెలిపిన

విద్యార్థిలోకం

స్వచ్ఛందంగా తరగతుల బహిష్కరణ

కోట కూడలిలో విద్యార్థి, యువజన

సంఘాల రాస్తారోకో

ధర్మేంద్ర ప్రధాన్‌ రాజీనామా

చేయాలని డిమాండ్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement