ఎనిమిదేళ్ల బాలుడికి కోవిడ్‌ పాజిటివ్‌ | - | Sakshi
Sakshi News home page

ఎనిమిదేళ్ల బాలుడికి కోవిడ్‌ పాజిటివ్‌

Jul 25 2026 12:59 AM | Updated on Jul 25 2026 12:59 AM

విజయనగరం ఫోర్ట్‌: ఎనిమిదేళ్ల బాలుడికి కరోనా సోకింది. వైద్యాధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం మండలానికి చెందిన బాలుడు ఈనెల 17వ తేదీన మలేరియా జ్వరంతో విజయనగరం జిల్లా కేంద్రంలోని ఘోషాస్పత్రి పిల్లల విభాగంలో కుటుంబ సభ్యులు చేర్పించారు. బాలుడి కాలుపై గాంగ్రిన్‌ (పుండు) రావడంతో ఘోషాస్పత్రి వైద్యులు బాలుడిని ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి డెర్మటాలజీ విభాగానికి ఈ నెల 23న రిఫర్‌చేశారు. కుటుంబ సభ్యులు బాలుడిని డెర్మటాలజీ వైద్యునికి చూపించగా కోవిడ్‌ వల్ల ఏర్పడిన గాంగ్రిన్‌గా అనుమానించి కోవిడ్‌ టెస్టు చేయాలని ల్యాబ్‌కు పంపించారు. అక్కడి వైద్య సిబ్బంది బాలుడికి రాపిడ్‌ టెస్టు చేయగా కోవిడ్‌ పాజిటివ్‌ నిర్ధారణ అయింది. కచ్చితమైన నిర్ధారణ కోసం ఆర్‌టీపీసీఆర్‌ టెస్టు కోసం ప్రభుత్వ వైద్య కళాశాల వైరాలజీ ల్యాబ్‌కు శాంపిల్‌ పంపించారు. శుక్రవారం ఆర్‌టీపీసీఆర్‌ టెస్టులో కోవిడ్‌ పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. బాలుడికి కోవిడ్‌ లక్షణాలు లేక పోవడంతో హోం ఐసోలేషన్‌లో ఉండాలని ఇంటికి పంపించారు.

సర్వజన

ఆస్పత్రిలో నిర్వహించిన పరీక్షలో

నిర్ధారణ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement