టీచర్ల సత్తా చూపిస్తాం..
విద్యా సంస్కరణల పేరుతో టీచర్లను ఇబ్బందులకు గురిచేయడం మంచిది కాదు.కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 20 నెలలు దాటుతున్నా ఇప్పటివరకూ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ఎలాంటి చర్యలూ తీసుకోలేదు.ఎన్నికల వేళ ఉద్యోగ,ఉపాధ్యాయులకు అలవిగాని హామీలు ఇచ్చారు.సమయానుకూలంగా డీఏలను ఎప్పటికప్పుడు ప్రకటిస్తామని,మెరుగైన పెన్షన్ విధానాన్ని తీసుకొస్తామని హామీ ఇచ్చారు. అధికారం చేపట్టి 20 నెలలవుతున్నా నేటికీ ఒక్క హామీ అమలు చేయకుండా మీనమేషాలు లెక్కిస్తున్నారు. ఆర్ధిక,విద్యారంగ సమస్యలు పరిస్కారించాలని డిమాండ్ చేస్తున్నాం. ప్రభుత్వం స్పందించకపోతే ఉద్యమాలు చేపడుతూ కూటమి సర్కారుకు టీచర్ల సత్తా ఏమిలో చూపిస్తాం. – ఎం. బలరాంనాయుడు,
ఏపీటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు


