సీతంలో కొనసాగిన పారిశ్రామిక నైపుణ్యాభివృద్ధి శిక్షణ | - | Sakshi
Sakshi News home page

సీతంలో కొనసాగిన పారిశ్రామిక నైపుణ్యాభివృద్ధి శిక్షణ

Feb 16 2026 7:13 AM | Updated on Feb 16 2026 7:13 AM

సీతంలో కొనసాగిన పారిశ్రామిక నైపుణ్యాభివృద్ధి శిక్షణ

సీతంలో కొనసాగిన పారిశ్రామిక నైపుణ్యాభివృద్ధి శిక్షణ

చికెన్‌

బ్రాయిలర్‌

లైవ్‌ డ్రెస్‌డ్‌ స్కిన్‌లెస్‌

శ్రీ130 శ్రీ230 శ్రీ240

చికెన్‌

విజయనగరం అర్బన్‌: గాజులరేగ పరిధిలోని సీతం ఇంజినీరింగ్‌ కళాశాలలో ‘పారిశ్రామిక నైపుణ్యాభివృద్ధి’ అంశంపై రెండు వారాలుగా నిర్వహిస్తున్న శిక్షణ శనివారం కొనసాగింది. ఈ సందర్భంగా ముఖ్యవక్తలు మాట్లాడుతూ పారిశ్రామిక ఆలోచన విధానం, వ్యాపార నమూనాల రూపకల్పన, ఆర్థిక వనరుల సమీకరణ, సంస్థ అభివృద్ధి ప్యూహాలపై విద్యార్థులకు విస్తృత అవగాహన కల్పించారు. ప్రస్తుత పోటీ ప్రపంచంలో నూతన ఆవిష్కరణలతో ముందుకు సాగాల్సిన అవసరాన్ని వివరించా రు. సంస్థ నమోదు విధానాలు, చట్టపరమైన అనుసరణలు, మేధోసంపత్తి హక్కులు, న్యాయ ప్రక్రియలపై సమగ్రంగా వివరించారు. స్టార్ట్‌అప్‌ ప్రారంభించే ముందు చట్టపరమైన అంశాలను అవగాహన చేసుకోవడం ఎంత ముఖ్యమని పేర్కొన్నారు. ముఖ్యవక్తలుగా డాక్టర్‌ కొండవేటి వెంకటేష్‌, అడ్వకేట్‌ పి.రవీంద్రబాబు పాల్గొన్నారు. అనంతరం ముఖ్యవక్తలను కళాశాల యాజమాన్యం ఘ నంగా సత్కరించింది. కార్యక్రమంలో కళాశాల డైరెక్టర్‌ డాక్టర్‌ మజ్జి శశిభూషణరావు, ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ డీవీరామమూర్తి, పరిశోధన, అభివృద్ది విభాగాధి పతి డాక్టర్‌ వీజీ ప్రసూన, కంప్యూటర్‌ సైన్స్‌ అండ్‌ ఇంజనీరింగ్‌ విభాగాధిపతి డాక్టర్‌ జి.వేణుమాధవరావు, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement