పసుపు ధర ఢమాల్
గిరిజనులు పండిస్తున్న పసుపు
నష్టాలే చవిచూస్తున్నాం..
ఈ ఏడాది నష్టాలే చవిచూస్తున్నాం. ఆరుగాలం శ్రమించి పండించిన పసుపు పంటకు కూడా మద్దతు ధర లేదు. ఏం చేయాలో తెలియడంలేదు. మోంథాతుఫాన్ వర్షాలకు పాడైన పంటలకు ఇప్పటివరకు పరిహారం అందలేదు. అన్నదాత సుఖీభవా వంటివి అందలేదు. ఇప్పుడు పసుపు పంటకు ధర ఉంటే చాలనుకున్నాం. మద్దతు ధర లేకపోవడంతో దిగాలుపడుతున్నాం. – ఎస్.ముఖలింగం, జజ్జువ
రైతులను ఆదుకోవాలి
పసుపు రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి. గిరిజన ప్రాంతాల్లో పసుపు రైతులు పెట్టుబడులు పెట్టి పండించినప్పటికీ పంట చేతికొచ్చిన వేళ ధర లేక పెట్టుబడి కూడా రావడంలేదు. నష్టాలు చవిచూడాల్సి వస్తోంది. ప్రభుత్వం మద్దతు ధర ప్రకటించి ఆదుకోవాలి.
– మంగయ్య, ఎంపీటీసీ, చిన్నబగ్గ
కొనుగోలు కేంద్రాలు నిల్....
గతంలో వెలుగు ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుచేసి పసుపు రైతులు నష్టపోకుండా మహిళా సంఘాలు పంటను కొనుగోలు చేసేవి. అప్పట్లో కూడా దళారీలు ప్రమేయం ఉండడం, అనుకున్న స్థాయిలో పసుపు కొనుగోలు చేయలేక వెలుగు అధికారుల కూడా చేతులెత్తేశారు. వనధన్ కేంద్రాలు రెండు, మూడు చోట్ల నామమాత్రంగానే పనిచేస్తున్నాయి. మార్కెటింగ్ సదుపాయం లేక ఇవి ఎక్కువ మొత్తంలో పసుపు సేకరించడంలేదని రైతులు చెబుతున్నారు. గిరిజన సహకార సంస్థ ఉన్నా ఫలితం లేదని వాపోతున్నారు.
కావిడ ధర రూ.900 నుంచి రూ.700కు పతనం
సీతంపేట ఏజెన్సీలో 1250 ఎకరాల్లో పసుపు సాగు
దిగుబడి పెరిగినా ధరలు లేవంటూ
గిరిజన రైతుల గగ్గోలు
పసుపు ధర ఢమాల్
పసుపు ధర ఢమాల్
పసుపు ధర ఢమాల్


