జగనన్న కల.. ప్రజలకు అందనున్న వేళ..
సాలూరు: పట్టణంలోని గుమడాం సమీపంలో నిర్మించి న ప్రైమరీ అర్బన్ హెల్త్ సెంటర్ అందుబాటులో కి రానుంది. మాజీ ఉపముఖ్యమంత్రి రాజన్నదొ ర కృషితో భవన నిర్మాణం పూర్తయింది. దీనిని మంత్రి సంధ్యారాణి శనివారం ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో గత వైఎస్సార్‌సీపీ ప్రభు త్వ హయాంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగ న్‌మోహన్ రెడ్డి వైద్యానికి చూపించిన ప్రత్యేక చొరవను స్థానికులు గుర్తు చేసుకుంటున్నారు.
వైద్యానికి పెద్దపీట..
గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం పేదలకు మెరుగైన వైద్యం అందించాలని వైద్యవిధానంపై పెద్దపీట వేసింది. మెడికల్ కళాశాలలు, వంద పడకల ఆస్పత్రుల నిర్మాణానికి ముందడుగు వేసింది. నాడు–నేడు కార్యక్రమంలో భాగంగా వైద్యాలయాలను ఆధునీకరించింది. ఆరోగ్య సురక్ష ద్వారా ప్రజల వద్దకే వైద్యసేవలు తదితర కార్యక్రమాలను విస్త్రతంగా చేపట్టింది. దీనిలో భాగంగా అప్పటి డిప్యూటీ సీఎం పీడిక రాజన్నదొర ప్రత్యేక చొరవ తీసుకున్నారు. పట్టణంలో 100 పడకల ఆస్పత్రితోపాటు, గుమడాం సమీపంలో ప్రైమరీ అర్బన్ హెల్త్ సెంటర్ మంజూరు చేయించారు. ప్రత్యేక శ్రద్ధతో ప్రభుత్వం నుంచి నిధులు విడుదల చేయించి పనులు ప్రారంభించారు.
రూ.80 లక్షల అంచనా వ్యయం...
ప్రైమరీ అర్బన్ హెల్త్ సెంటర్ నిర్మాణానికి సుమారు రూ.80 లక్షలు కేటాయించారు. అనంతరం పనులు పూర్తికి మరో రూ.20 లక్షలు అవసరం అయ్యాయి. ఈ నేపథ్యంలో నిధులు చాల క పనులు నిలిచిపోయాయని తెలుసుకున్న రాజన్నదొర ముందుగా మున్సిపాలిటీ నిధులతో పనులు చేపట్టే కౌన్సిల్ సమావేశంలో చర్యలు తీసుకున్నారు. మరోవైపు డిపార్ట్‌మెంట్ ద్వారా అదనపు నిధులు మంజూరుకు తోడ్పాటు అందించారు. మున్సిపల్ ఆమోదం, డిపార్ట్‌మెంట్ ద్వారా కూడా నిధులు రావడంతో పనులకు అడ్డంకి తొలగింది. అనంతరం చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా నేటికి తుదిదశ పనులు పూర్తయ్యాయి.


