నైపుణ్యాలతో కూడిన విద్య అవసరం
–IIలో
విజయనగరం అర్బన్: నైపుణ్యాలతో కూడిన ఉన్నతవిద్య నేటి పోటీ ప్రపంచానికి అవసరమని, ఆ దిశగా విద్యాబోధన సాగాలని సెంచూరియన్ యూనివర్సిటీ వీసీ ప్రొఫెసర్ ప్రశాంతకుమార్ మహంతి అన్నారు. వర్సిటీ ఫోరెన్సిక్ సైన్స్ విభాగం, ఎంఆర్ అటానమస్ కళాశాల జువాలజీ విభాగం సంయుక్తంగా ‘రీసెంట్ అడ్వాన్సెస్ ఇన్ ఫోరెన్సిక్ సైన్స్ అండ్ క్వాంటం సెక్యూరిటీ’ అనే అంశంపై ఎంఆర్ కళాశాలలో శుక్రవారం నిర్వహించిన ఒక రోజు హ్యాండ్స్ ఆన్ శిక్షణకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆధునిక సాంకేతిక నైపుణ్యాలను పెంపొందించుకుంటే ఏదైనా సాధించవచ్చన్నారు. ఫోరెన్సిక్ సైన్స్ రంగంలో కొత్త టెక్నాలజీలు అందుబాటులోకి వచ్చాయని, అవసరమైన ప్రాక్టికల్ అనుభవం సెంచూరియన్ విశ్వవిద్యాలయంలో పొందవచ్చని తెలిపారు. వర్సిటీ ఫోరెన్సిక్ సైన్స్ విభాగం డీన్ ప్రొఫెసర్ రవికుమార్ మాట్లాడుతూ భవిష్యత్తులో స్కిల్ ఇండియా రాబోతుందన్నారు. క్వాంటం టెక్నాలజీ, జీనో సీక్వెన్సింగ్ వంటి నూతన టెక్నాలజీలను విద్యార్థులు అందిపుచ్చుకోవాలని సూచించారు. అనంతరం ముఖ్యఅతిథిని ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో మాన్సాస్ కరెస్పాండెంట్ ప్రొఫెసర్ కేవీఎల్‌రాజు, ఎంఆర్ కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ సాంబశివరావు, జువాలజీ విభాగాధిపతి ఎ.గోపాల్, డాక్టర్ శివగణేష్, డాక్టర్ నాగజగ్గయ్య, ఆదిత్య మహిళా కళాశాల, ఎంఆర్‌కళాశాల, ఎస్‌ఎస్‌ఎస్‌ఎస్ డిగ్రీ కళాశాల, సెంచూరియన్ యూనివర్సిటీ విద్యార్థులు పాల్గొన్నారు.
సెంచూరియన్ యూనివర్సిటీ వీసీ ప్రొఫెసర్ ప్రశాంతకుమార్ మహంతి
ఫోరెన్సిక్ సైన్స్‌పై ముగిసిన ఒక రోజు శిక్షణ


