9వ తేదీలోగా పాసుపుస్తకాల పంపిణీ పూర్తిచేయాలి
● కలెక్టర్ ఎస్.రాంసుందర్‌రెడ్డి
విజయనగరం అర్బన్: జిల్లాలో పట్టాదారు పాసుపుస్తకాల పంపిణీని ఈ నెల 9వ తేదీలోగా పూర్తి చేయాలని కలెక్టర్ ఎస్.రాంసుందర్‌రెడ్డి రెవెన్యూ అధికారులను ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్, ట్రాన్స్‌పోర్ట్, ఆర్‌అండ్‌బీ స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఎం.టి.కృష్ణబాబు, ఇతర ఉన్నతాధికారులు శుక్రవారం సాయంత్రం సచివాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రభుత్వ సేవలు ప్రజాభిప్రాయం, రైల్వే మౌలిక సదుపాయాలు, భూసేకరణ తదితర అంశాలపై సమీక్షించారు. జిల్లా నుంచి కలెక్టర్ ఎస్.రాంసుందర్‌రెడ్డి, జేసీ సేతుమాధవన్, ఇతర అధికారులు పాల్గొన్నారు. వీడియో కాన్ఫరెన్స్ అనంతరం కలెక్టర్ అధికారులతో మాట్లాడుతూ పలు ఆదేశాలు జారీ చేశారు. పట్టాదారు పాసుపుస్తకాల పంపిణీతో పాటు, నియోజకవర్గ స్థాయిలో కార్యక్రమాలు ఏర్పాటు చేసి ప్రజాప్రతినిధులను భాగస్వాములుగా చేయాలని సూచించారు. యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వేను ఈ నెల 12వ తేదీలోగా పూర్తి చేయాలని ఆదేశించారు.
అభివృద్ధి పనులను
వేగవంతం చేయండి
విజయనగరం అర్బన్: జిల్లాలో చేపట్టిన వివిధ అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని కలెక్టర్ ఎస్.రాంసుందర్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. టెలికాన్ఫరెన్స్‌లో శుక్రవారం వివిధ శాఖల అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఓడీఎఫ్‌తో పాటు ఉపాధిహామీ పనుల్లో పురోగతి ఉండేలా చూడాలన్నారు. జిల్లాలో మంజూరైన 40 సచివాలయ భవనాల్లో ఇప్పటి వరకు కేవలం 17 మాత్రమే గ్రౌండింగ్ అయ్యాయని, మిగిలిన భవనాల పనులను ప్రారంభించాలని కలెక్టర్ ఆదేశించారు. 9 భవనాలకు గుర్తించిన ప్రత్యామ్నాయ స్థలాల ప్రతిపాదనలు సమర్పించాలన్నారు.
కొమరాడ: ఇటీవల ఒడిశా సరిహద్దులోని నాగవళి నది ఆవలవైపు సంచరించిన గజరాజుల గుంపు శుక్రవారం జంఝావతి గట్టుదాటి లక్ష్మీపేట, కంచరపాడు గ్రామాల సమీపంలోని చీకటిలోవ కొండ వద్దకు చేరుకున్నాయి. ఎప్పుడు ఏ ప్రమాదం తలపెడుతాయోనని కంచరపాడు, పాత కంబవలస, లక్ష్మీపేట గ్రామస్తులు బిక్కుబిక్కుమంటున్నారు. రాజ్యలక్ష్మీపురం, కుమ్మరిగుంట, స్వామినాయుడువలస, గంగారేగువలస తదితర గ్రామాల్లో కూరగాయలు, జొన్న పంటల సాగులో ఉన్నాయి. పంట ఏపుగా పెరిగే సమయంలో ఏనుగులు సంచరిస్తే నాశనమవుతుందని రైతులు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం స్పందించి ఏనుగుల తరలింపునకు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
9వ తేదీలోగా పాసుపుస్తకాల పంపిణీ పూర్తిచేయాలి
9వ తేదీలోగా పాసుపుస్తకాల పంపిణీ పూర్తిచేయాలి


