జెడ్పీలో కొత్త సంవత్సర వేడుకలు
● జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావుకు శుభాకాంక్షలు తెలిపిన స్థానిక సంస్థల ప్రతినిధులు, అధికారులు
విజయనగరం రూరల్: జిల్లా పరిషత్‌లో జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో నూతన సంవత్సర వేడుకలను గురువారం ఘనంగా నిర్వహించారు. జెడ్పీ సీఈవో బీవీ సత్యనారాయణ సమక్షంలో జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు కేక్ కట్ చేశారు. అనంతరం ఉమ్మడి జిల్లా ప్రజలకు, నాయకులకు, అధికారులకు, అభిమానులకు ఆయన నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. ఉమ్మడి జిల్లాల నుంచి జెడ్పీటీసీలు, ఎంపీపీలు, ఎంపీటీసీలు, సర్పంచ్‌లు, అభిమానులు వందలాది మంది తరలివచ్చి జెడ్పీ చైర్మన్‌కు పుష్పగుచ్చాలు, బొకేలు అందజే శారు. జెడ్పీ మహిళా ఉద్యోగులు ఆయనకు పూలమొక్కలు అందించి శుభాకాంక్షలు తెలిపా రు. చిన్న శ్రీను సోల్జర్స్ అధ్యక్షురాలు మజ్జి సిరి సహస్ర, బి.ప్రదీప్‌నాయుడు దంపతులు పాల్గొని జెడ్పీ చైర్మన్‌కు కేక్ తినిపించారు.
ఉద్యోగులకు నూతన సంవత్సర కానుక
నూతన సంవత్సర దినోత్సవాన్ని పురస్కరించుకుని జెడ్పీ చైర్మన్ ఆరుగురు ఉద్యోగులకు ఉద్యోగోన్నతి ఉత్తర్వులను కానుకగా అందజేశారు. కె.రితిక, ఎం.దినేష్‌కుమార్, కె.వంశీకృష్ణ, సీహెచ్ ఉదయ్‌కు జూనియర్ సహాయకులుగా నియామక పత్రాలు అందించారు. మరో ఇద్దరికి రికార్డు అసిస్టెంట్లగా నియమిస్తూ ఉత్తర్వులిచ్చారు.
విజయనగరం అర్బన్: ఆంగ్ల నూతన సంవత్సర వేడుకలు గురువారం జిల్లా కేంద్రంలో, కలెక్టరేట్‌లో ఘనంగా జరిగాయి. అయ్యన్నపేట కూడలి సమీపంలోని కల్యాణ మండపంలో నిర్వహించిన నూతన సంవత్సర వేడుకల్లో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ కేక్ కట్ చేసి అందరికీ పంచిపెట్టారు. కలెక్టర్ ఎస్.రాంసుందర్‌రెడ్డి మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌కు, జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎం.బబితకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. కలెక్టర్ ఎస్.రాంసుందర్‌రెడ్డికి పలువురు అధికారులు, వివిధ శాఖల ఉద్యోగులు, సిబ్బంది జిల్లా కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో కలిసి పుస్తకాలు, పెన్నులు, పూల మొక్కలు అందజేశారు. జిల్లా సమాచార పౌర సంబంధాల శాఖ సహాయ సంచాలకులు పి.గోవిందరాజులు, ఆ శాఖ సిబ్బంది కలెక్టర్‌ను కలిసి శుభాకాంక్షలు తెలిపారు.
కొత్త సంబరం
జెడ్పీలో కొత్త సంవత్సర వేడుకలు
జెడ్పీలో కొత్త సంవత్సర వేడుకలు
జెడ్పీలో కొత్త సంవత్సర వేడుకలు


