● భక్తిశ్రద్ధలతో ధనుర్మాస ఉత్సవాలు
● బొబ్బిలిలో అనసూయ సందడి
జామి మండలంలోని అన్నంరాజుపేట పంచాయతీ పుష్పగిరి వేణుగోపాలస్వామి ఆలయంలో సోమవారం ధనుర్మాస మహోత్సవం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకుడు ఘణిహారం సీతారామాచార్యుల ఆధ్వర్యంలో స్వామివారికి, గోదాదేవికి నైవేద్యం సమర్పించారు. కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని పూజలు నిర్వహించారు. అనంతరం ప్రసాద వితరణ చేశారు.
● వేంకటేశ్వర ఆలయంలో.. భీమసింగి సుగర్ ఫ్యాక్టరీ వేంకటేశ్వర స్వామి ఆలయంలోనూ ధనుర్మాస వేడుకలు వైభవంగా జరిగాయి. – జామి
బొబ్బిలి పట్టణంలో సినీనటి అనసూయ సోమవారం సందడి చేశారు. ముందుగా ఎస్‌ఆర్ షాపింగ్ మాల్‌ను ప్రారంభించారు. అనంతరం షాపంతా కలియతిరిగారు. సరమైన ధరలకే వస్త్రాలను విక్రయించడం ఎస్‌ఆర్ షాపింగ్‌మాల్ ప్రత్యేకమని, వినియోగదారులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. సంక్రాంతి ఆఫర్లను అందిపుచ్చుకోవాలన్నారు. అనంతరం తనను చూసేందుకు వచ్చిన అభిమానులకు అభివాదం చేస్తూ కొన్ని చిత్రాల పాటలకు స్టెప్పులు వేసి సందడి చేశారు. అభిమానులతో కేరింతలు కొట్టించారు. ప్రస్తుతం మూడు చిత్రాల్లో నటిస్తున్నట్టు తెలిపారు. టీవీ అయినా సినిమా అయినా ఒకేలా ప్రేమిస్తానన్నారు. జర్నలిస్టుగా పనిచేస్తూ ఈ రంగంలోకి వచ్చానన్నారు. సంప్రదాయబద్ధంగా ఉండడమంటే ఇష్టమని, అందుకే సోషల్ మీడియాలో నచ్చిన వారిని విమర్శించినా, కామెంట్ చేసినా వెంటనే స్పందిస్తానన్నారు. కార్యక్రమంలో షాపింగ్‌మాల్ యజమానులు ప్రసాదరెడ్డి, కేశవరెడ్డి, మాజీ ఎమ్మెల్యే శంబంగి వెంకట చిన అప్పలనాయుడు, మాజీ మంత్రి సుజయకృష్ణ రంగారావు, మున్సిపల్ చైర్మన్ రాంబార్కి శరత్, వైఎస్సార్ సీపీ జిల్లా ప్రధానకార్యదర్శి శంబంగి వేణుగోపాలనాయుడు, తదితరులు పాల్గొన్నారు. – బొబ్బిలి
● భక్తిశ్రద్ధలతో ధనుర్మాస ఉత్సవాలు


