● రబీలోనూ యూరియా కరువు
రబీ సీజన్‌లోనూ రైతులకు యూరియా కష్టాలు తప్పడం లేదు. ఆర్‌ఎస్‌కేలు, ప్రైవేటు దుకాణాల వద్ద పనులు మానుకుని రోజంతా లైన్లలో నిరీక్షించాల్సిన దుస్థితి నెలకొంది. గరివిడి మండలంలోని మందిరవలస, గదబవలస, గెడ్డపువలస రైతు సేవా కేంద్రాల్లో గురువారం యూరియా పంపిణీ చేశారు. బస్తా యూరియా కోసం రోజంతా క్యూలో పడిగాపులు కాశారు. దీనికి గెడ్డపువలస ఆర్‌ఎస్‌కే వద్ద బారులు తీరిన రైతుల చిత్రమే నిలువెత్తు
నిదర్శనం. – చీపురుపల్లిరూరల్ (గరివిడి)


