ఓపెన్‌స్కూల్ పరీక్ష ఫీజు చెల్లింపు షెడ్యూల్ విడుదల
● డిసెంబర్ 1 నుంచి ఆన్‌లైన్‌లో ఫీజు చెల్లింపు ప్రారంభం
విజయనగరం అర్బన్: ఆంధ్రప్రదేశ్ ఓపెన్ స్కూల్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించే ఎస్‌ఎస్‌సీ, ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు–2026కు సంబంధించిన పరీక్ష ఫీజుల చెల్లింపు షెడ్యూల్ వివరాలను డీఈఓ యు.మాణిక్యంనాయుడు మంగళవారం ప్రకటించారు. ఫీజులు డిసెంబర్ 1వ తేదీ నుంచి 10వ తేదీలోపు‘ఏపీఓపెన్‌స్కూల్.ఏపీ.జీఓవి.ఐఎన్’ వెబ్‌సైట్‌లో చెల్లించవచ్చన్నారు. రూ.25 ఆలస్య రుసుంతో డిసెంబర్ 11, 12వ తేదీల్లోను, రూ.50 ఆలస్య రుసుంతో డిసెంబర్ 13 నుంచి 15వ తేదీలోపు పరీక్ష ఫీజు చెల్లించుకోవచ్చన్నారు. ప్రాక్టికల్స్ ఉన్న ఇంటర్ పాఠ్యాంశాలకు ప్రతి సబ్జెక్టుకు రూ.100, ప్రాక్టికల్స్ లేని సబ్జెక్టులకు రూ.150 పరీక్ష ఫీజులు చెల్లించాల్సి ఉంటుందని తెలిపారు. ఫీజు చెల్లింపుపై విద్యార్థులకు అధ్యయన కేంద్ర నిర్వాహకులు అవగాహన కల్పించాలని ఆదేశించారు.
బీఎల్‌ఏలను నియమించండి
విజయనగరం అర్బన్: రాజకీయ పార్టీలు ప్రతిపోలింగ్ బూత్‌కు తమ ప్రతినిఽధిగా ఒక ఏజెంట్‌ను (బీఎల్‌ఏ) నియమించుకోవాలని జిల్లా రెవెన్యూ అధికారి ఎస్.శ్రీనివాసమూర్తి సూచించారు. తన చాంబర్‌రో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో మంగళవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రస్తుతం జిల్లాలో 15,72,464 మంది ఓటర్లు ఉన్నారని చెప్పారు. మార్పులు, చేర్పులు, తొలగింపులకు ఎప్పుడైనా దరఖాస్తు చేయవచ్చన్నారు. ప్రస్తుతం జిల్లాలో 1,847 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయని, కొత్తగా మరో 122 కేంద్రాల ఏర్పాటుకు ప్రతిపాదించామని డీఆర్‌ఓ తెలిపారు. సమావేశంలో ఎన్నికల విభాగం సూపరింటెండెంట్ భాస్కరరావు, రాజకీయ పార్టీల ప్రతినిధులు శ్రీనివాసరెడ్డి, కుటుంబరావు, అప్పా రావు, శ్రీనివాసరావు, సీపీఎం నుంచి టి.సూర్యనారాయణ, సోములు, రమేష్‌రాజు, తదితరులు పాల్గొన్నారు.
విద్యార్థులకు ‘పరీక్ష’!
రాజాం సిటీ: అంబేడ్కర్ యూనివర్సిటీ పరిధిలో డిగ్రీ విద్యార్థులకు 5వ సెమిస్టిర్ పరీక్షలు మంగళవారం ప్రారంభమయ్యాయి. విద్యార్థులకు ఇచ్చిన ప్రశ్నపత్రంపై నవంబర్–2025 సప్లిమెంటరీ 5వ సెమిస్టర్ అని ముద్రించి ఉండడంతో విద్యార్థులు కాసేపు గందరగోళానికి గురయ్యారు. సప్లిమెంటరీ పేపర్ వచ్చినట్టు సంబంధిత ఇన్విజిలేటర్లకు చూపించారు. వారు సంబంధిత హెచ్‌ఓడీల దృష్టికి తీసుకువెళ్లారు. ప్రశ్నపత్రంపై సప్లిమెంటరీ అని వచ్చినా అది ప్రస్తుత సిలబస్‌కు సంబంధించిన పేపరేనని నిర్ధారించడంతో పరీక్ష రాసేందుకు సిద్ధమయ్యారు. పదేళ్లుగా పరీక్షలు నిర్వహిస్తున్నా ఎగ్జామినేషన్ సెక్షన్ తడబాటుకు గురికావడంపై అధ్యాపకులు విస్మయం వ్యక్తంచేశారు.
ఓపెన్‌స్కూల్ పరీక్ష ఫీజు చెల్లింపు షెడ్యూల్ విడుదల
ఓపెన్‌స్కూల్ పరీక్ష ఫీజు చెల్లింపు షెడ్యూల్ విడుదల


