● విజయనగరం వేదికగా ముగిసిన
రాష్ట్ర స్థాయి బాలికల ఖోఖో పోటీలు
విజయనగరం: విజయనగరం వేదికగా గత మూడు రోజులుగా జరుగుతున్న రాష్ట్రస్థాయి స్కూల్‌గేమ్స్ అండర్–17 బాలికల ఖోఖో పోటీలు మంగళవారంతో ముగిశాయి. విజయనగరం విజ్జీ స్టేడియంలో మూడు రోజుల పాటు ఉత్కంఠ భరిత వాతావరణంలో సాగిన పోటీల్లో తూర్పుగోదావరి, చిత్తూరు, విజయనగరం, శ్రీకాకుళం జట్లు మొదటి నాలుగుస్థానాలు దక్కించుకున్నాయి. పోటీల్లో విజేతలుగా నిలిచిన జట్లకు విజయనగరం మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ కోలగట్ల శ్రావణి, డీఈఓ యు.మాణిక్యంనాయుడు బహుమతులు ప్రదానం చేశారు. త్వరలో జాతీయస్థాయిలో జరగనున్న పోటీలకు ఆంధ్రప్రదేశ్ జట్టు తరఫున ప్రాతినిథ్యం వహించే 12 మంది ప్రధాన జట్టుతో పాటు స్టాండ్ బై క్రీడాకారుల జాబితాను నిర్వాహకులు ప్రకటించారు. రాష్ట్ర జట్టులోకి స్థానం దక్కించుకున్న వారిలో డి.నందిని, డి.సత్య, ఎం.కృష్ణవేణి (తూర్పుగోదావరి), జి.దివ్య, సత్యవతి (చిత్తూరు), ఎం.ధనలక్ష్మి, ఎం.అనిత (విజయనగరం), నవ్య (విశాఖపట్నం), ఎం.హారిక (శ్రీకాకుళం), డి.రంగమహాలక్ష్మి (గుంటూరు), ఎన్.నిహారిక (కృష్ణ), హేమలత (కర్నూల్) ఉన్నారు. స్టాండ్‌బై క్రీడాకారులుగా జి.నిత్యశ్రీ (గుంటూరు), సి.అమృత (చిత్తూరు), ఎస్.తేజశ్రీ (శ్రీకాకుళం), పి.శాండి (తూర్పుగోదావరి), జ్యోత్స్న (విశాఖపట్నం) క్రీడాకారులు ఉన్నారు.


