రజకులను విస్మరించిన చంద్రబాబు ప్రభుత్వం
● నీలి తామరాకుపై జాతీయ చిహ్నం
జాతీయ రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకొని కొత్తవలస మండలం దెందేరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల బాలికలు అప్పికొండ మేఘన, గుమ్మడి శశి ప్రియ భారీ నీటితామరాకుపై మంగళవారం జాతీయ చిహ్నాన్ని, రాజ్యాంగ దినోత్సవ అక్షరాలను చెక్కి అబ్బురపరిచారు. దీనిని పాఠశాల ప్రాంగణంలో ప్రదర్శించారు. బాలికల చిత్రలిపి ప్రతిభను పాఠశాల డ్రాయింగ్ టీచర్ పరమేశ్వరరావు, ఉపాధ్యాయులు మెచ్చుకున్నారు. – కొత్తవలస
● రజక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కొండపల్లి
విజయనగరం టౌన్: చంద్రబాబు ప్రభుత్వం ఎన్నికల్లో రజకులకు ఇచ్చిన హామీలను విస్మరించిందని రజక సంఘం వ్యవస్థాపకుడు కేతిగుంట్ల సుబ్బారాయుడు, రాష్ట్ర అధ్యక్షుడు కొండపల్లి రామకృష్ణ అన్నారు. విజయనగరం ప్రెస్‌క్లబ్‌లో మంగళవారం నిర్వహించిన ఏపీ రజక సేవా సంఘం విజయనగరం జిల్లా కార్యవర్గం ఎన్నికలో వారు మాట్లాడారు. రజక వృత్తిదారులకు అన్నిరకాల చాకిరేవు స్థలాలపై చట్టబద్ధమైన హక్కు కల్పించాలని, రజకులను ఎస్సీ జాబితాలో చేర్చాలని డిమాండ్ చేశారు. జిల్లా రజక సంఘం అధ్యక్షుడిగా ఏలూరు గురుమూర్తి, ఉపాధ్యక్షుడిగా ఈశ్వరరావు, కార్యదర్శిగా సల్లాది అప్పలస్వామి, సహాయ కార్యదర్శిగా గురజాపు శ్రీను, కోశాధికారిగా వెల్దుర్తి రాము, కార్యవర్గ సభ్యులుగా పోలిపల్లి దేముడు, శీల సన్యాసిరావు, తామాడ తౌడు, అచ్చంశెట్టి పాపమ్మ, బొండపల్లి పైడిరాజు, పోలిపల్లి రాంబాబు, కందివలస సీతారాం, ఏలూరు గురుదామోదరరావు, రమణ, ఉమామహేశ్వరరావు ఎన్నికయ్యారు. కార్యక్రమంలో అధిక సంఖ్యలో కులసంఘ ప్రతినిధులు పాల్గొన్నారు.
రజకులను విస్మరించిన చంద్రబాబు ప్రభుత్వం


